Business Idea : జాబ్ వదిలి.. సొంతగా బిజినెస్ పెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇంతకీ ఏ బిజినెసో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : జాబ్ వదిలి.. సొంతగా బిజినెస్ పెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇంతకీ ఏ బిజినెసో తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :16 May 2025,1:00 pm

Business Idea : ఎంబీఏ పట్టా పొందిన తరువాత ఇతరుల్లా కార్పొరేట్ ఉద్యోగాల వైపు పోకుండా, ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంకి చెందిన సాయి అనే యువకుడు పండ్ల వ్యాపారాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. తన విద్యా పరిజ్ఞానాన్ని, వ్యాపార నైపుణ్యాలను వాడుకొని రైతుల నుంచి నేరుగా నాణ్యమైన పండ్లను సేకరించటం మొదలుపెట్టారు. దీంతో రైతులకు న్యాయమైన ధరలు లభించగా, వినియోగదారులకు తక్కువ ధరలకే పండ్లను అమ్మడం చేస్తూ వచ్చాడు. దీంతో అతి తక్కువ టైంలోనే సాయి చాల పాపులర్ అయ్యాడు. మిగతా షాప్స్ వారే కాకుండా చుట్టుపక్కల వారు కూడా సాయి వద్ద తక్కువ ధరలకే ఎక్కువ పండ్లు వస్తుండడం తో కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.

అంతే సాయి వందలు కాదు లక్షల్లో సంపాదించడం మొదలుపెట్టారు. సలాడ్లు, జ్యూస్‌లు, జామ్‌లు వంటి ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను మార్కెట్‌కి పరిచయం చేసి, వినియోగదారుల మనసు గెలుచుకున్నాడు. అంతేకాకుండా ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా ఫ్రూట్ గిఫ్ట్ బాక్స్‌లను రూపొందించి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. సాయి అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇంటికే డెలివరీ సేవలు అందజేస్తూ, డిజిటల్ మార్కెట్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు.

Business Idea జాబ్ వదిలి సొంతగా బిజినెస్ పెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు ఇంతకీ ఏ బిజినెసో తెలుసా

Business Idea : జాబ్ వదిలి.. సొంతగా బిజినెస్ పెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇంతకీ ఏ బిజినెసో తెలుసా..?

సోషల్ మీడియా ద్వారా తన వ్యాపారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, వినియోగదారులతో నేరుగా మమేకమవుతూ వారి అభిరుచులను అర్థం చేసుకుంటూ వ్యాపార వ్యూహాలను రూపొందిస్తున్నాడు. పండ్లలో ఉన్న పోషక విలువలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ ఆరోగ్యంపై చైతన్యం పెంచుతున్నాడు. తన ముందు చూపు, కృషి, పట్టుదలతో ఫ్రూట్స్ వ్యాపారంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సాయి, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది