Brahmam Gari kalagnanam Gold Price Prediction : బంగారం బదులు చెక్కతో తాళిబొట్టు.. బంగారం ధరలపై నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmam Gari kalagnanam Gold Price Prediction : బంగారం బదులు చెక్కతో తాళిబొట్టు.. బంగారం ధరలపై నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 January 2026,3:00 pm

ప్రధానాంశాలు:

  •   Brahmam Gari kalagnanam Gold Price Prediction : బంగారం బదులు చెక్కతో తాళిబొట్టు.. బంగారం ధరలపై నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం

Brahmam Gari kalagnanam Gold Price Prediction  : ప్రస్తుతం బంగారం ధరల ( Gold Prices ) దూకుడు చూస్తుంటే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒకప్పుడు మధ్యతరగతికి అందేలా ఉన్న పసిడి ధర.. నేడు అందని ద్రాక్షలా మారిపోయింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర Gold Rates  ఏకంగా రూ.1.50 లక్షల మార్కును దాటడం మార్కెట్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది. అయితే.. ఈ పరిస్థితులను చూస్తుంటే వందల ఏళ్ల క్రితమే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ( Potuluri Veerabrahmendra Swamy ) చెప్పిన కాలజ్ఞానం నిజమవుతోందా? అని భక్తులు చర్చించుకుంటున్నారు.

Brahmam Gari kalagnanam Gold Price Prediction బంగారం బదులు చెక్కతో తాళిబొట్టు బంగారం ధరలపై నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం

Brahmam Gari kalagnanam Gold Price Prediction : బంగారం బదులు చెక్కతో తాళిబొట్టు.. బంగారం ధరలపై నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం

 Brahmam Gari kalagnanam Gold Price Prediction  : నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం?

brahmam gari kalagnanam  బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో brahmam gari kalagnanam about gold భవిష్యత్తు గురించి అనేక విషయాలను ముందే ఊహించి రాశారు. అందులో బంగారం గురించి ప్రస్తావిస్తూ.. “ఒకానొక సమయంలో బంగారం Gold  సామాన్యులకు అంటరాని వస్తువుగా మారుతుంది. ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. చివరికి మహిళలు బంగారం కొనుక్కోలేక చెక్క తాళిబొట్టు ( Wooden Mangalsutra ) కట్టుకునే రోజులు వస్తాయి” అని చెప్పినట్లు చరిత్రకారులు  చెబుతున్నారు. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది మంగళసూత్రం. స్తోమత ఉన్నా లేకపోయినా తాళిబొట్టు మాత్రం బంగారంతో చేయించుకోవడం మన ఆచారం. కానీ, ప్రస్తుత ధరలు చూస్తుంటే పేదవారు బంగారం జోలికి వెళ్లే సాహసం కూడా చేయలేకపోతున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బంగారం కేవలం ధనికుల ఇళ్లలో మాత్రమే కనిపించే అలంకార వస్తువుగా మారుతుందేమో అనే ఆందోళన కలుగుతోంది.

 Brahmam Gari kalagnanam Gold Price Prediction : ఐదేళ్లలో.. ఊహించని మార్పు

గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే బంగారం ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. 5 ఏళ్ల క్రితం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.50,000 లోపే ఉండేది. ప్రస్తుతం అదే తులం బంగారం కొనాలంటే దానికి మూడు రెట్లు, అంటే రూ. 1.50 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు (31.10 గ్రాములు) ధర తొలిసారిగా 5,000 డాలర్లను దాటడం రికార్డు సృష్టించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ధరలు డబుల్ అవ్వడం ఇదే తొలిసారి.

ధరల పెరుగుదలకు అసలు కారణాలివే

బంగారం ధరలు ఇంతలా పెరగడానికి కేవలం డిమాండ్ మాత్రమే కారణం కాదు, అంతర్జాతీయ పరిణామాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ప్రారంభమైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి కోసం బంగారం వైపే చూస్తున్నారు. షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల బంగారమే సేఫ్ అని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టడం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఆయన చైనా, ఇరాన్, వెనిజులా వంటి దేశాలపై విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు, పన్నులు (Tariffs) బంగారం ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి. ట్రంప్ వడ్డీ రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బాండ్ల మీద వచ్చే ఆదాయం తగ్గుతుంది, దీంతో అందరూ బంగారం కొనుగోలుకే మొగ్గు చూపుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. 2025లో కేవలం 9 నెలల్లోనే 600 టన్నులకు పైగా బంగారాన్ని బ్యాంకులు కొనుగోలు చేశాయి.

 Brahmam Gari kalagnanam Gold Price Prediction ఛాన్స్ ఉందా?

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదని మార్కెట్ నిపుణులు తేల్చి చెబుతున్నారు. వెండి ( Silver ) ధరలు కూడా బంగారంతో పాటే పోటీ పడుతున్నాయి. బ్రహ్మంగారి మాట నిజమై.. సామాన్యులు బంగారాన్ని మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది