Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?
ప్రధానాంశాలు:
Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు ఇప్పుడు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో సామాన్యుల నుంచి పెట్టుబడిదారుల వరకూ అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి, భవిష్యత్ అంచనాలు అన్నీ కలిసి బంగారాన్ని మళ్లీ “సేఫ్ హెవెన్”గా మార్చేశాయి.
Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?
Gold Price: అంతర్జాతీయ ఉద్రిక్తతలతో బంగారం ధరలకు రెక్కలు
ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1.60 లక్షల వద్ద కొనసాగుతోంది. రెండు వారాల క్రితం వరకు ఇది రూ.1.40–1.45 లక్షల మధ్య ఊగిసలాడగా అమెరికా–ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు ఒక్కసారిగా మార్కెట్ దిశను మార్చేశాయి. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు దిగే అవకాశాలున్నాయన్న వార్తలు, యుద్ధ నౌకల కదలికలు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భద్రతా బంకర్‌లోకి వెళ్లారన్న అంతర్జాతీయ మీడియా కథనాలు బంగారంపై డిమాండ్‌ను పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకన్నా బంగారంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఫలితంగా గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ ఊగిసలాట కనిపిస్తోంది. ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో ఫిజికల్ గోల్డ్ కొనుగోళ్లకు ఆసక్తి తగ్గినా డిజిటల్ గోల్డ్ గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ వారంలోనే కాక రానున్న రోజుల్లో కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Gold Price: 2050 నాటికి బంగారం ధరలు: ఏఐ టూల్స్ షాకింగ్ అంచనాలు
ప్రస్తుత ధరల ఉధృతిని చూసినప్పుడు “ఇక ముందు ఎంతవరకు పెరుగుతుంది?” అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఈ క్రమంలో చాట్ జీపీటీ, గ్రోక్, గూగుల్ జెమినీ వంటి ఏఐ టూల్స్‌ను అడిగితే ఆసక్తికరమైన అంచనాలు వెలుగులోకి వచ్చాయి. గత దశాబ్దాల గోల్డ్ ట్రెండ్స్, వార్షిక వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువల ఆధారంగా వీటన్నీ దాదాపు ఒకే తరహా సమాధానాలు ఇచ్చాయి. సగటున 10 శాతం వార్షిక వృద్ధి నమోదైతే 2050 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.14–15 లక్షలకు చేరవచ్చని అంచనా. అదే బలమైన డిమాండ్ రూపాయి విలువ పతనం ద్రవ్యోల్బణ ప్రభావాలు కొనసాగితే ఈ ధర రూ.20–22 లక్షల వరకూ వెళ్లే అవకాశం ఉందని ఏఐ చెబుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే తులం బంగారం ధర 2050 నాటికి ఏకంగా రూ.40 లక్షలకు కూడా చేరొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే బంగారం పూర్తిగా సామాన్యులకు అందని ఆస్తిగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Gold Price: కాలజ్ఞానం నిజమవుతోందా? బ్రహ్మంగారి ప్రవచనాలపై చర్చ
బంగారం ధరలు ఇంత వేగంగా పెరుగుతుండటంతో కాలజ్ఞానాలపై కూడా చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శతాబ్దాల క్రితమే బంగారం సామాన్యులకు అందని వస్తువుగా మారుతుందని తన కాలజ్ఞానంలో చెప్పారని చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు. ఒక దశలో బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో మహిళలు బంగారు తాళికి బదులుగా చెక్క తాళి ధరించే రోజులు వస్తాయని ఆయన పేర్కొన్నట్టు ప్రచారం ఉంది. హిందూ సంప్రదాయంలో వివాహ సమయంలో బంగారు తాళి అత్యంత పవిత్రంగా భావిస్తారు. కానీ ఒక్క గ్రాము బంగారం కొనేందుకు కూడా వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావడం పేద, మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గత రెండేళ్లలో బంగారం ధర పెరిగిన వేగం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతోందేమో అన్న భావన ప్రజల్లో బలపడుతోంది. బంగారం ధరల ఉధృతి కేవలం మార్కెట్ వార్తగా కాకుండా భవిష్యత్ జీవన విధానాన్నే ప్రభావితం చేసే అంశంగా మారుతోంది.