Business Idea : తక్కువ పెట్టుబడితో నెలకు 50 వేల రూపాయలు… దీనికి మార్కెట్లో ఫుల్ డిమాండ్… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business Idea : తక్కువ పెట్టుబడితో నెలకు 50 వేల రూపాయలు… దీనికి మార్కెట్లో ఫుల్ డిమాండ్…

Business Idea : చాలామంది వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించాలి. అనుకుంటూ ఉంటారు. కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ వాటిలో లాభాలు కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమంది వ్యాపారం పెట్టుకోవాలి, అనుకుంటారు కానీ వారికి డబ్బు అందుబాటులో ఉండదు. ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే చదువుకునే ఉద్యోగుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు కొందరు, వారు కూడా ఏదో ఒక వ్యాపారం అన్న చేయాలి. డబ్బులు సంపాదించాలి. అని అనుకుంటూ ఉంటారు. అలాగే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :22 July 2022,5:00 pm

Business Idea : చాలామంది వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించాలి. అనుకుంటూ ఉంటారు. కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ వాటిలో లాభాలు కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమంది వ్యాపారం పెట్టుకోవాలి, అనుకుంటారు కానీ వారికి డబ్బు అందుబాటులో ఉండదు. ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే చదువుకునే ఉద్యోగుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు కొందరు, వారు కూడా ఏదో ఒక వ్యాపారం అన్న చేయాలి. డబ్బులు సంపాదించాలి. అని అనుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది ఆరోగ్యం సరిగా లేక బయటికి వెళ్లి పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని వ్యాపారాలకు ,అస్సలు మార్కెట్లో డిమాండ్ అంటూ, ఉండదు. ఇలా ఆ రకరకాల కారణాలతో వ్యాపారాలలో సమస్యలు ఉంటాయి. అయితే జనాలలో మంచి గిరాకీ ఉన్న బిజినెస్, మంచి లాభాలు వచ్చే బిజినెస్, ఒక ప్లాన్ తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బిజినెస్ గ్రామాల నుండి సిటీల వరకు బాగా గిరాకీ ఉంటుంది.

దేశంలో కరోనా మహమ్మారి కారణంగా అందరూ హెల్త్ పై బాగా శ్రద్ధను పెట్టారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం కోసం, ధనం ఖర్చు పెడుతున్నారు. పోషక ఆహార పిండి బిజినెస్ పెడితే, చాలా బాగా లాభాలు వస్తాయని అంటున్నారు. తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం, ఈ వ్యాపారాన్ని తక్కువ డబ్బుతో మీరు మొదలు పెట్టవచ్చు. దీనికి నెల నెల భారీగా లాభాలు ను అందుకుంటారు. ఈ పోషక ఆహార పిండి శరీరానికి రోగనిరోధ శక్తిని అందిస్తుంది. అలాగే కొందరు ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు ఆ వ్యాధులను ఎదుర్కొనే శక్తి ,ఈ పిండిలో ఉంటుంది అంటున్నారు. అలాగే దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పిండితో చేసే ప్రతి వంట కూడా చాలా రుచిగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దీనికి మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నది. ఈ పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం.. దీనికి గోధుమలను తీసుకొచ్చి వాటిని ముందుగా 12 గంటల పాటు నానబెట్టి తరువాత అవి కాస్త మొలకెత్తి దశకు రాగానే వాటిని నీటి నుంచి వేరుచేసి నీడలో ఆరబెట్టుకోవాలి. తర్వాత ఎండలో పూర్తిగా ఎండే వరకు ఎండబెట్టాలి. తరువాత వీటిని పిండిగా ఆడించాలి.

Business Idea on 50 thousand rupees per month with low investment

Business Idea on 50 thousand rupees per month with low investment

700 గ్రాముల ఈ గోధుమ పిండిలో 50 గ్రాముల మునగ ఆకుల పొడిని, అలాగే 100 గ్రాముల కందిపొడిని, అదేవిధంగా 50 గ్రాముల మెంతిపిండి 25 గ్రాముల అశ్వగంధ పొడి, 25 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ గోధుమ పిండిలో ఇవన్నీ కలిపితే అదే పోషక ఆహార పిండి అవుతుంది. దీనికి ఒక కిలో పిండి తయారు చేయడానికి 30 నుంచి 35 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలాగే మార్కెటింగ్ కోసం ఇంకొక ఐదు రూపాయలు ఖర్చవుతాయి దీనిని హోల్సేల్ మార్కెట్లో 50 రూపాయలకు రిటైల్ మార్కెట్లో రూ 60 కి అమ్ముకోవచ్చు. ఇలా కిలో పిండి పై పది రూపాయల లాభం వస్తుంది. ఇలా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి నెలకి 50 వేల రూపాయల ఆదాయంను పొందవచ్చు. ఈ పిండిని తయారీ కోసం ముందుగా సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ మైసూర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఎంటర్ ఫ్రెన్యూర్ మేనేజ్మెంట్ కుండలి నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ వ్యాపారం కోసం చట్టబద్ధంగా అనుమతులన్నీ తీసుకొని మొదలుపెట్టాలి. లేదు అంటే కొన్ని సమస్యలు ఎదురవల్సి వస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది