Business Idea : మీకు బిజినెస్ చేయాలని ఉందా.. ఇది ట్రై చేయండి.. నెలకు రూ.50వేలు మీ సొంతం..?
Business Idea : న్యూ ఇయర్‌లో చాలా మంది ఎన్నో ఆశలు, కొత్త ఐడియాలతో జీవితంలో ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. గతంలో చేసిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి సృష్టించిన విలయంతో చాలా మంది ఆలోచన తీరులో మార్పు వచ్చింది. కొవిడ్ వలన చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు పడ్డారు. దీంతో సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని నేటి యువత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు తమ ఐడియాలను కార్యరూపంలోకి తీసుకొచ్చారు. మరికొందరు ఇన్వెస్ట్‌మెంట్, మంచి బిజినెస్ ఐడియా కోసం ఎదురుచూస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా వ్యాపారం చేయాలని చాలా మంది ఆలోచిస్తున్నారట..
అలాంటి వారికోసమే ఈ బిజినెస్ ప్లాన్.. ట్రై చేసి చూడండి కొత్త సంవత్సరంలో సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి కారు సర్వీస్ సెంటర్ గురించి ఒకసారి ఆలోచన చేయండి. కొవిడ్ తర్వాత చాలా మంది సొంతంగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. వాటికి సరైన ప్రాంతంలో సర్వీస్ సెంటర్లు లేక కంపెనీ సర్వీస్ సెంటర్‌కు వెళితే రోజుల తరబడి స్లాట్ దొరకడం లేదు. ఈ మధ్య పట్టణాల నుంచి పల్లెల వరకు చాలా మంది సొంతంగా కార్లును ఉపయోగిస్తున్నారు. కంపెనీ సర్వీస్ లేనివాళ్లు ప్రైవేట్ సెంటర్లను నమ్ముకుంటున్నారు. అందుకే ఈ బిజినెస్ ఐడియా గురించి ఒక్కసారి ఆలోచించండి. కేవలం రూ. 22, 000 వేలతో పెట్టుబడితో నెలకు రూ. 50 వేలకు పైగా ఆదాయం పొందొచ్చు.కారు వాషింగ్ సెంటర్ కోసం హైవే లేదా మంచి ప్రాంతంలో ఓ షాప్ చూసుకోవాలి.
Business Idea : సింపుల్ అండ్ లో ఇన్వెస్ట్‌మెంట్
పక్కనే మెకానిక్ సెంటర్ ఉంటే అతనితో బిజినెస్ డీల్ మాట్లాడుకోండి. కారు వాషింగ్ కోసం ప్రొఫెషనల్ మెషిన్ అవసరం. మార్కెట్లో చాలా రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. రూ.12 వేల నుంచి రూ.లక్ష వరకు ఈ యంత్రాల ధర ఉంటుంది. తక్కువ ఖర్చుతో వ్యాపారం చేయాలనుకునే వారు రూ.14,000తో ఒక యంత్రాన్ని కొనుగోలు చేశారనుకుందాం.ఈ ధరలో రెండు హార్స్ పవర్ మిషిన్స్ వస్తాయి. దీనికి తోడు 30 లీటర్ల వాక్యూమ్ క్లీనర్‌ను కొనాలి. దీని ధర రూ. 9 వేల నుంచి రూ.10 వేలు ఉంటుంది. షాంపూ, గ్లోవ్స్, టైర్ పాలిష్ అండ్ డాష్‌బోర్డ్ పాలిష్‌తో సహా అన్నింటికి మరో రూ. 2 వేలు అవుతుంది. రోజుకు 7-8 కార్లకు సర్వీస్ చేసినా 2 నుంచి 3వేలు ఎటూ పోవు. ఇలా చేస్తే నెలకు రూ.40 నుంచి 50వేలు సంపాదించుకోవచ్చు.