Rs. 500 Notes : రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rs. 500 Notes : రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ…!

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Rs. 500 Notes : రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ...!

Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు చలామణిలోకి వచ్చాయి. అయితే, 2023లో రూ. 2000 నోటు ఉపసంహరణతో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఇప్పుడు అత్యంత పెద్ద కరెన్సీ నోటుగా ఉన్న రూ. 500 నోటు కూడా రద్దవుతుందేమోనని చాలామంది అనుమానించారు. ఈ అనుమానాలకు ప్రధాన కారణం ఏటీఎంలలో రూ. 100, రూ. 200 నోట్ల లభ్యతను పెంచాలని ఆర్బీఐ బ్యాంక్ లకు ఆదేశాలు ఇవ్వడం. అయితే ఈ భయాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

Rs 500 Notes రూ500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ

Rs. 500 Notes : రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ…!

Rs. 500 Notes : ఎటిఎం లలో రూ. 500 నోట్లు ఉండడం లేదా..? కేంద్రం క్లారిటీ

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. రూ. 500 నోట్ల సరఫరాను నిలిపివేసే ప్రతిపాదన ఏదీ తమ దగ్గర లేదని స్పష్టం చేశారు. ఏటీఎంలలో రూ. 100, రూ. 200 నోట్లతో పాటు రూ. 500 నోట్ల పంపిణీ కూడా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రకటనతో రూ. 500 నోటు రద్దవుతుందనే భయాలకు తాత్కాలికంగా తెరపడింది. ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, 2025 సెప్టెంబర్ 30 కల్లా దేశంలోని 75% ఏటీఎంలలో, 2026 మార్చి 31 కల్లా 90% ఏటీఎంలలో రూ. 100, రూ. 200 నోట్లు అందుబాటులో ఉంచాలి. ఇది కరెన్సీ పంపిణీని మెరుగుపరచడానికే తప్ప రూ. 500 నోటు రద్దుకు సంకేతం కాదని స్పష్టమవుతోంది.

ఇక రూ. 2000 నోటు ఉపసంహరణ గురించి ఆర్బీఐ ఇటీవల మరోసారి ప్రకటన చేసింది. ఉపసంహరణ ప్రారంభించినప్పుడు రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు ఉండగా, ఇప్పటికీ ప్రజల దగ్గర రూ. 6017 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని తెలిపింది. ప్రజలు తమ వద్ద ఉన్న ఈ నోట్లను ఇప్పటికీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలలో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవచ్చని పేర్కొంది. మొత్తం మీద, కరెన్సీ విధానాలపై వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ ఇచ్చిన స్పష్టతతో ప్రజల్లో నెలకొన్న గందరగోళం కొంతవరకు తొలగిపోయినట్లు చెప్పవచ్చు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది