Business : జస్ట్ 15 వేలు పెట్టి వ్యాపారం మొదలు పెడితే.. నెలకు 50 వేల దాకా ఆదాయం.. మీరు చూసేయండి..!
Business : కొంతమంది వ్యక్తులు ఒకరి దగ్గర పనిచేసి జీతం తీసుకోవడం కన్నా సొంత బిజినెస్ చేసి జీవనం సాగించాలని అనుకుంటారు. అందులో తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ ల గురించి చూస్తుంటారు. అలా తక్కువ బడ్జెట్ తో ఇంటి దగ్గర నుంచి చేసుకునే వ్యాపారాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి పత్తి వత్తుల బిజినెస్. మహిళలు సులభంగా ఇంట్లోనే చేసుకునే ఈ బిజినెస్ చాలా తక్కువ బడ్జెట్ తో మొదలు పెట్టొచ్చు. వత్తులు అనేవి […]
ప్రధానాంశాలు:
Business : జస్ట్ 15 వేలు పెట్టి వ్యాపారం మొదలు పెడితే.. నెలకు 50 వేల దాకా ఆదాయం.. మీరు చూసేయండి..!
Business : కొంతమంది వ్యక్తులు ఒకరి దగ్గర పనిచేసి జీతం తీసుకోవడం కన్నా సొంత బిజినెస్ చేసి జీవనం సాగించాలని అనుకుంటారు. అందులో తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ ల గురించి చూస్తుంటారు. అలా తక్కువ బడ్జెట్ తో ఇంటి దగ్గర నుంచి చేసుకునే వ్యాపారాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి పత్తి వత్తుల బిజినెస్. మహిళలు సులభంగా ఇంట్లోనే చేసుకునే ఈ బిజినెస్ చాలా తక్కువ బడ్జెట్ తో మొదలు పెట్టొచ్చు. వత్తులు అనేవి ప్రతి ఇంట్లో పూజ ల్లో వాడుతుంటారు. దీపాలు వెలిగించేందుకు వత్తులు ఉపయోగపడతాయి. వ్రతాలు వస్తే చాలు వత్తులకు డిమాండ్ బాగా ఉంటుంది. ఎంతోమంది మహిళలు ఈ వత్తులను కావాలని తీసుకుంటారు. ఐతే ఈ వత్తుల వ్యాపారం మంచి లాభాలు తెచ్చి పెడుతుంది. వత్తుల బిజినెస్ కు ప్రత్యేకంగా ప్లేస్ అన్నది అవసరం లేదు. మీరు ఉంటున్న ఇంట్లోనే ఈ బిజినెస్ మొదలు పెట్టొచ్చు.
Business మిషన్ల ద్వారా వత్తుల తయారీ..
వత్తుల తయారీకి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఐతే వీటి కోసం కొత్తగా మిషన్లు వచాయి. కాట్ విక్ తయారీ మిషన్ తో వత్తులు ఈజీగా తయారు చేయొచ్చు. దీని ధర మార్కెట్ లో 12 వేల దాకా ఉంది. ఈ మిషన్ తీసుకుని ఇంట్లోనే వత్తుల తయారీని మొదలు పెట్టొచ్చు. ఐతే దీని కోసం నాణ్యమైన పత్తిని రైతుల దగ్గర నుంచి కొని వత్తులు తయారు చేయాల్సి ఉంటుంది. మిషన్ ఖర్చు కూడా ఎందుకు అనుకున్న వారు చేతితో వత్తులు తయారు చేస్తారు. ఐతే ఈ వ్యాపారంలో దాదాపు 50 శాతం వరకు లాభాలు వస్తాయి. పత్తి కిలో 14 నుంచి 15 వేల వరకు ఉంటుంది. దీని తో దాదాపు రెండు వందల ప్యాకెట్లు అంటే ఒక్కో దానిలో 15 వత్తులు ఉండేలా చేస్తే దాని ద్వారా నెలకు 60 వేల దాకా ప్యాకెట్లు సిద్ధం అవుతాయి.
ఒక వేళ మీరే పత్తి పంటను పండిస్తే మీకు మరింత ఖర్చు మిగులుతుంది. ఈ వ్యాపారంలో మీరు 50% వరకు లాభం పొందవచ్చు. ఒక కిలో ముడి పత్తి నుంచి 14 నుంచి 15 వేల వరకు వత్తులను తయారు చేసుకోవచ్చు. రోజుకు కనీసం రెండు వందల ప్యాకెట్ల వత్తులను (ప్యాకెట్లో 15 వత్తులు) తయారు చేసినా కూడా నెలకు 6000కుపైగా ప్యాకెట్లు సిద్ధమవుతాయి. ఇక మార్కెట్ లో వత్తుల ధర 10 నుంచి 20 ఉంటుంది. సో 6000 వేల ప్యాకెట్లు 10 రూపాయలు లాభం వేసుకుంటే 60 వేల దాకా సంపాదించే ఛాన్స్ ఉంది.