Ganesh Chaturthi Boosts | గణేష్ చతుర్థి 2025: భక్తి పండుగ మాత్రమే కాదు… రూ. 45,000 కోట్ల వ్యాపారం!
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ పండుగ కేవలం ఆధ్యాత్మికత, సంప్రదాయానికి పరిమితం కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థకు భారీ స్థాయిలో ప్రోత్సాహంనిచ్చింది. ఈ ఏడాది గణేష్ చతుర్థి వల్ల దేశవ్యాప్తంగా రూ. 45,000 కోట్ల మేర వ్యాపారం జరిగిందట. గత ఏడాది ఇది రూ. 25,000 కోట్లు మాత్రమే ఉండగా, ఈసారి ప్రత్యేకంగా స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడంతో వ్యాపారం భారీగా పెరిగిందని చెప్పారు.

#image_title
విగ్రహాలే రూ. 1000 కోట్ల బిజినెస్
CAIT జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా వివరించిన ప్రకారం గణేశ విగ్రహాల వ్యాపారం: రూ. 1,000 కోట్లు,
పూలు, దండలు, కొబ్బరికాయలు, పూజా సామగ్రి: రూ. 500 కోట్లు, మోదకాలు, ఇతర స్వీట్లు: రూ. 2,000 కోట్లు, కేటరింగ్, స్నాక్స్ సర్వీసులు: రూ. 3,000 కోట్లు, పందిళ్లపై భారీ ఖర్చు – రూ. 10,000 కోట్లు అని తెలిపారు. ఇక ఈ ఏడాది దేశంలో దాదాపు 20 లక్షల గణేశ పందిళ్లు ఏర్పడ్డాయి. వాటిలో మహారాష్ట్ర: 7 లక్షలు, కర్ణాటక: 5 లక్షలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్: ఒక్కో రాష్ట్రంలో 2 లక్షల పందిళ్లు ఏర్పాటు చేశారు.
ఒక్కో ఒక్క పందిరికి కనీసం రూ. 50,000 ఖర్చు చేస్తే, మొత్తం పందిళ్ల ఏర్పాట్లపై రూ. 10,000 కోట్లు ఖర్చైనట్లు అంచనా. గణేష్ చతుర్థి కారణంగా టూరిజం, ట్రాన్స్‌పోర్ట్ (బస్సులు, క్యాబ్‌లు, రైళ్లు): రూ. 2,000 కోట్లు, బట్టలు, ఆభరణాలు, హోమ్ డెకర్, గిఫ్ట్ ఐటెమ్స్: రూ. 3,000 కోట్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు: రూ. 5,000 కోట్లు బిజినెస్ జరిగింది.