Dogs Walker : కుక్కలని వాకింగ్ తీసుకెళుతూ అన్ని లక్షలు సంపాదిస్తున్నాడా.. ఎలా..?
ప్రధానాంశాలు:
Dogs Walker : కుక్కలని వాకింగ్ తీసుకెళుతూ అన్ని లక్షలు సంపాదిస్తున్నాడా.. ఎలా..?
Dogs Walker : ఈ డాగ్ వాకర్ రోజూ 38 కుక్కలకు సేవలు అందిస్తున్నాడు. ఉదయం, సాయంత్రం రెండుసార్లు వాకింగ్‌కు తీసుకెళ్లడమే కాకుండా వాటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. ఒక్క కుక్కకు నెలకు రూ.10,000–15,000 వసూలు చేస్తూ, విలాసవంతమైన ప్రాంతాల్లో నివసించే పెంపుడు జంతు ప్రేమికులకు ప్రత్యేక సేవలందిస్తున్నాడు.

Dogs Walker : కుక్కలని వాకింగ్ తీసుకెళుతూ అన్ని లక్షలు సంపాదిస్తున్నాడా.. ఎలా..?
Dogs Walker : ఇదేదో బాగుందిగా..
ఈ యువకుడి సోదరుడు MBA పూర్తి చేసి నెలకు రూ.70,000 సంపాదిస్తుంటే, ఇతను మాత్రం అదే కుటుంబానికి చెందిన వాడిగా నైపుణ్యంతో, అంకితభావంతో ఆ సంపాదనకి ఆరు రెట్లు సంపాదిస్తున్నాడు. మా అన్న MBA చేసినా, నేను నా కష్టంతో సాధించిన విజయం ఆయనకన్నా ఎక్కువ. ఇది డిగ్రీల విషయమేం కాదు, మమకారంతో చేసే పనికి విలువ ఉంటుందన్నది నా నమ్మకం అని ఈ యువకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఈ డాగ్ వాకర్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వైరల్ అవుతోంది. “డిగ్రీ కంటే నైపుణ్యం ముఖ్యం!”, “పని చిన్నది, పెద్దదన్న తేడా లేదు!” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు, మీమ్స్ కూడా తెగ షేర్ అవుతున్నాయి.ఈ యువకుడి విజయానికి మూలం స్మార్ట్ టైమ్ మేనేజ్‌మెంట్, నాణ్యమైన సేవ, మరియు ఫ్రీలాన్సింగ్ స్ట్రాటజీ. నగరంలోని బడా క్లయింట్లను టార్గెట్ చేయడం, ప్రతీ కుక్కపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ఇవన్నీ అతని ఆదాయాన్ని పెంచే ప్రధాన కారణాలు.
View this post on Instagram