Sewing Mission Training : మహిళలకు కుట్టు మిష‌న్‌లో ఉచిత శిక్ష‌ణ.. ఈ 15 లోపు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sewing Mission Training : మహిళలకు కుట్టు మిష‌న్‌లో ఉచిత శిక్ష‌ణ.. ఈ 15 లోపు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :8 May 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Sewing Mission Training : మహిళలకు కుట్టు మిష‌న్‌లో ఉచిత శిక్ష‌ణ.. ఈ 15 లోపు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం

Sewing Mission Training : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మహిళలకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు అందించింది. అనంతపురం జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ గోవింద రాజులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాధిక బుధ‌వారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 30 మంది ఎస్సీ మహిళలకు శిక్షణ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. రెండు నెలల పాటు సాగే ఈ శిక్షణకు 18 నుంచి 35 ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు.

Sewing Mission Training మహిళలకు కుట్టు మిష‌న్‌లో ఉచిత శిక్ష‌ణ ఈ 15 లోపు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం

Sewing Mission Training : మహిళలకు కుట్టు మిష‌న్‌లో ఉచిత శిక్ష‌ణ.. ఈ 15 లోపు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం

ఆసక్తిగల వారు ఈ నెల 15వ తేదీ లోపు విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, రెండు ఫొటోలతో సాయినగర్ 1వ క్రాస్లోని 30వ నంబరు వార్డు సచివాలయం వద్దనున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని సూచించారు. వివరాలకు 9908620306 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

కుట్టుపని నేర్చుకోవడం ద్వారా సొంతంగా బట్టలు కుట్ట‌డం లేదా టైలరింగ్ వ్యాపారం ప్రారంభించి ఆదాయం పొందవచ్చు. టైలరింగ్ షాపులు, గార్మెంట్ ఫ్యాక్టరీలు, డిజైనర్ బొటిక్‌లలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇది ఒక మంచి మార్గం. సొంతంగా ఏదైనా చేయగలగడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్న వ్యాపారం ప్రారంభించడానికి అవకాశం. తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది