Dairy Farming : చదవుకోకపోయిన పాలు అమ్ముతూ…రూ.33 లక్షలు సంపాదిస్తున్న మహిళ..?
ప్రధానాంశాలు:
Dairy Farming : చదవుకోకపోయిన పాలు అమ్ముతూ...రూ.33 లక్షలు సంపాదిస్తున్న మహిళ..?
Dairy Farming : ఈ రోజుల్లో చాలా మంది కూడా వ్యాపారాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఏ వ్యాపారం బాగుంటుంది అనే దానిపై అందరిలో అనేక సందేహాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో పాల వ్యాపారానికి మంచి డిమాండ్ ఏర్పడింది. పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ నెలకు సాఫ్ట్ ఉద్యోగుల కంటే అధికంగా సంపాదిస్తోంది. ఏడాదికి ఏకంగా కోటీ 25 లక్షల లాభంతో పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ కథ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది. ఇక మంగలమ్మ వద్ద ప్రస్తుతం 30కిపైగా పాలు ఇస్తున్న ఆవులు ఉన్నాయి. 2024లో ఆమె డైరీకి 1,01,915 లీటర్ల పాలను సరఫరా చేసి, 33 లక్షల రూపాయల ఆదాయం పొందారు.
Dairy Farming : భలే ఆలోచన..
ఇరవై సంవత్సరాల క్రితం, 2 ఆవులతో చిన్న స్థాయిలో డైరీ ఫార్మింగ్ ప్రారంభించినట్టు తెలియజేశారు.. చాప్ కట్టర్, మిల్కింగ్ మెషిన్ వంటి పరికరాలను ఉపయోగించడం వలన రోజు 300 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నాం. ఈ విధంగా మంచి ఆదాయాన్ని పొందుతున్నాం,” అని తెలిపారు. పెద్దగా చదువుకోకపోయినా పాల వ్యాపారంతో మగలమ్మ లక్షల్లో డబ్బులు సంపాదిస్తూ కష్టాన్ని నమ్ముకుంటే విజయం తనంతట తానే మనల్ని చేరుతుందని నిరూపిస్తోంది.మంగలమ్మ ఒకేసారి 30 ఆవులను పెట్టకుండా.. మొదట కేవలం 2 ఆవులతో ప్రారంభించింది. పాల వ్యాపారంలో ఉండే కష్టనష్టాలను చూస్తూ వాటికి తట్టుకొని నిలబడింది. వ్యాపారం చేయాలంటే పెట్టుబడితో పాటు మార్కెటింగ్, సహనం ఉండాలి. లేదంటే నష్టాలు తప్పవు అని అంటుంది.
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా, నబానా గ్రామంలో 15 ఏళ్ల క్రితం 15 గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది నవల్‌బీన్ దల్సంభాయ్ చౌదరి (65). కాల క్రమేణా 15 గేదెలు కాస్తా 250కిపైగా విస్తరించాయి. రోజూ 11 వందల లీటర్ల పాలు సరఫరా చేస్తోంది. ఇలా ప్రతీ నెల 11 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ప్రతి 15 రోజులకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఆమె బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంటాయి. నవల్‌బీన్ ఏడాదికి కోటీ 25 లక్షల ఆదాయం అర్జిస్తున్నారు. ఇక ఆమె నడుపుతున్న డైరీలో 10 మంది పనిచేస్తున్నారు. వారి నెల జీతం రూ.లక్షన్నరకు పైనే. మహిళా సాధికారతకు నవల్‌బీన్ చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆరవై ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ విజయ వంతంగా పాల వ్యాపారం నడపడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్యర్యపోతారు.