Today Gold Rate : ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో ల‌క్ష దిగువ‌కు ఈ రోజు బంగారం ధ‌ర‌లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Rate : ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో ల‌క్ష దిగువ‌కు ఈ రోజు బంగారం ధ‌ర‌లు..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 April 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Today Gold Rate : ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో ల‌క్ష దిగువ‌కు ఈ రోజు బంగారం ధ‌ర‌లు..!

Today Gold Rate : బంగారం Gold Price కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద శుభ‌వార్త అని చెప్పాలి. Gold Rates తులం బంగారం రేటు ఒక్కరోజే ఏకంగా రూ.3000 తగ్గింది. బంగారం ధరల పరుగులకు బ్రేక్ పడింది .చైనాపై టారిఫ్‌లు తగ్గిస్తామన్న సంకేతాలు ఇచ్చారు ట్రంప్. దీంతో బంగారం పెట్టుబడులపై మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. ఏప్రిల్ 24వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూస్తే..24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు ఇవాళ ఒక్కరోజే తులంపై రూ.3000 తగ్గింది.

Today Gold Rate ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో ల‌క్ష దిగువ‌కు ఈ రోజు బంగారం ధ‌ర‌లు

Today Gold Rate : ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో ల‌క్ష దిగువ‌కు ఈ రోజు బంగారం ధ‌ర‌లు..!

Today Gold Rate ఉప‌శ‌మ‌నం..

దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 98 వేల 350 వద్దకు దిగివచ్చింది. అంతకు ముందు రోజు లక్ష మార్క్ చేరిన సంగతి తెలిసిందే. రికార్డ్ గరిష్ఠాల నుంచి వెనక్కి వస్తుండడం భారీ ఊరటగా చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులంపై రూ.2750 తగ్గింది. దీంతో తులం ధర రూ.90 వేల 150 వద్దకు పడిపోయింది.

ఈ నెలలో బంగారం ధర దాదాపు 12 వేల రూపాయలు పెరిగింది. అయితే బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. ఈ నేపథ్యంలో పసిడి ధరలపై ప్రతి ఒక్కరు కన్నేసి ఉంచారు. అయితే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈసారి అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేసింది. కాగా, ఒక కేజీ వెండి ధర రూ. 100741 పలికింది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది