Post Office Scheme : మనలో చాలా మంది కష్టపడి సంపాదించిన సొమ్ముపై ఎంతో కొంత రాబడి రావాలని కోరుకుంటారు. కొందరేమో రిస్క్ చేసి అధిక ఆదాయం వచ్చే పెట్టుబడుల్ని ఆశ్రయిస్తారు. మరికొందరు మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలని అనుకుంటారు. అలాంటి వారికోసం పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మంచి ఎంపిక అవుతుంది. పెట్టుబడికి భద్రతతో పాటు స్థిరమైన నెలవారీ ఆదాయం పొందాలనుకొనేవారు ఈ స్కీమ్ చూసుకోవచ్చు. స్థిరమైన ఆదాయం అందించే పథకంగా మంచి ప్రజాదరణ పొందింది. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు నెలవారీ ఆదాయాన్ని పొందొచ్చు. పెట్టుబడిదారులు డిపాజిట్ చేసిన సొమ్ముకు మార్కెట్‌తో సంబంధం ఉండదు అందువల్ల మీ డిపాజిట్ సేఫ్‌గా ఉంటుంది.
ఈ పథకంలో కనీసం రూ. 1000 నుంచి పెట్టుబడి గరిష్టంగా రూ. 9 లక్షలు వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ గరిష్టంగా ముగ్గురు కలిసి రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ పథకంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి నెలా వడ్డీ అందుకుంటారు. మెచ్యూరిటీ ఐదేళ్లుగా ఉండగా.. అప్పుడు మీ పెట్టుబడి కూడా వెనక్కి తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీంలో 7.40 శాతం వడ్డీ రేటు ఉంది.మెచ్యూరిటీ పూర్తయ్యేవరకు ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు. అయితే, ఈ పథకం కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఎంఐఎస్ ఖాతా తెరిచిన తర్వాత ఐదేళ్లకు మెచ్యూరిటీ పూర్తవుతుంది. ఒకవేళ ముందస్తు ఉపసంహరణ చేస్తే నిబంధనల ప్రకారం వడ్డీపై కొంత శాతాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
ఒకేసారి పెట్టుబడితో నెలవారీ ఖర్చులకు అనుగుణంగా వడ్డీ పొందాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ స్టాక్ మార్కెట్లతో సంబంధం ఉండదు పెట్టుబడిని బట్టి వడ్డీ 7.40 శాతం ప్రకారం అందుకుంటారు. ఉదాహరణకు సింగిల్ అకౌంట్ గరిష్ట పెట్టుబడి 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి నెలా వడ్డీ రూపంలో రూ. 5550 అందుకుంటారు. అదే 5 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా రూ. 3083 వడ్డీ రూపంలో అందుకోవచ్చు. ఇక జాయింట్ ఖాతా తెరిచి రూ.15 లక్షలు డిపాజిట్ చేసిన వారికి రూ.9,250 నెలవారీ ఆదాయం వస్తుంది. మీ నెలవారీ ఖర్చు, కావాలనుకొనే ఆదాయం ఆధారంగా పెట్టుబడి పెట్టవచ్చు
Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఇస్కాన్ కోల్‌కతా తిలకం తుడిచివేయాలని మరియు తులసి పూసలను దాచుకోవాలని, తలలు…
Hemant Soren : జార్ఖండ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాత్రమే మంత్రిగా…
Donald Trump : తాను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా…
Rashmika Mandanna : ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే రష్మిక ఇప్పుడు దారుణంగా అందాలు ఆరబోస్తుంది. స్కిన్ షో విషయంలో…
Tollywood : డిసెంబర్ 5న పుష్ప2 Pushpa 2 చిత్రం విడుదల కానుండగా డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర ఫైట్ జరగుతుంది. టాప్ 5 కోసం…
Farmers : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట…
Lipstick : ప్రస్తుత కాలంలో చాలామంది లిప్ స్టిక్ లేకుండా అస్సలు ఉండలేరు. అయితే ఈ లిప్ స్టిక్ ను పెదవులు…
This website uses cookies.