Financial : వారసులకి ఆర్ధిక వీలునామా రాసేటప్పుడు జాగ్రత్త.. లేదంటే మొత్తం పోతుంది..!
ప్రధానాంశాలు:
Financial : వారసులకి ఆర్ధిక వీలునామా రాసేటప్పుడు జాగ్రత్త.. లేదంటే మొత్తం పోతుంది..!
Financial : భారతదేశంలో చాలా పాత షేర్ సర్టిఫికెట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు వంటి క్లెయిమ్ చేయని ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్నప్పుడు వాటిని క్లెయిమ్ చేయలేని పరిస్థితి. అలా జరగకుండా ఉండాలి అంటే ఆర్థిక వీలునామా చాలా ముఖ్యం. ఇందుకోసం సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పెట్టుబడులకి సంబంధించి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి.

Financial : వారసులకి ఆర్ధిక వీలునామా రాసేటప్పుడు జాగ్రత్త.. లేదంటే మొత్తం పోతుంది..!
Financial ఈ విషయంలో జాగ్రత్త..
మీ ఆస్తులు వారసత్వంగా ఎవరికి దక్కాలో కూడా స్పష్టంగా ఉండాలి. వారి పేర్లు, ప్రతి ఒక్కరికి లభించే వాటా శాతం మెన్షన్ చేయాలి. మీ ఇష్టానుసారం వీలునామా అమలు అయ్యేలా చూడటానికి ఒక నమ్మకమైన వ్యక్తిని ఎగ్జిక్యూటర్‌గా ఎంచుకోండి.
మీ అన్ని బ్యాంకు అకౌంట్లు, పెట్టుబడులు, ఇన్సూరెన్స్ పాలసీల నామినీ వివరాల అప్‌డేటెడ్‌గా ఉండేలా చూసుకోండి. ఫిజికల్, డిజిటల్ రికార్డులను మెయింటెన్ చేయండి. మీ వారసులకు అందుబాటులో ఉండేలా పాన్, ఆధార్, ఆస్తి పత్రాలు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ యాడ్ చేయండి.
తప్పనిసరి కానప్పటికీ, సబ్-రిజిస్ట్రార్ దగ్గర మీ వీలునామాను రిజిస్టర్ చేయడం మంచిది. అప్పుడు లీగల్ వ్యాలిడిటీ పెరుగుతుంది, ఇది వివాదాల అవకాశాలను తగ్గిస్తుంది. ఆస్తులను పంపిణీ చేసేటప్పుడు పన్ను చెల్లింపులను కూడా పరిగణనలోకి తీసుకోండి. అలానే అపార్థాలు లేకుండా ఉండాలంటే స్పష్టమైన భాష వాడాలి. అనవసరమైన గందరగోళాలకు తావివ్వకండి. ఫైనాన్షియల్ ప్లానర్‌ని సంప్రదించడం మంచిది.