Auto Driver : నెలకు రూ.5 నుండి 8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్ ఐడియా.. ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేస్తుంది..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 5 June 2025, 8:00 pm
  •  నెలకు రూ.5 నుండి 8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్ ఐడియా.. ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేస్తుంది..!

Auto Driver : ఈరోజుల్లో ఉద్యోగం సాధించడం కత్తిమీద సాము అయ్యింది. IITలు, IIM పాసైన వారు జాబ్స్ కోసం తిరుగుతున్నారు. అయితే ముంబైకి చెందిన ఓ సాధారణ ఆటో డ్రైవర్ మాత్రం నెలకు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. ఐతే ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. అతను తన ఆటోను నడిపే పని కూడా చేయడం లేదు! ఆటోను పార్క్ చేసి, చిన్న ఐడియాతో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ స్మార్ట్‌ బిజినెస్ ఐడియా గురించి లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు రాహుల్ రూపానీ లింక్డ్‌ఇన్‌లో వివరించారు.

Auto Driver : నెలకు రూ.5 నుండి 8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్ ఐడియా.. ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేస్తుంది..!

Auto Driver : నెలకు రూ.5 నుండి 8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్ ఐడియా.. ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేస్తుంది..!

Auto Driver నెలకు రూ.5 నుండి 8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్..ఐడియా తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు

అమెరికన్ ఎంబసీ వద్ద వీసా అపాయింట్‌మెంట్ కోసం వచ్చినవారు తమ బ్యాగులు లోపలికి తీసుకెళ్లలేరు. ఎందుకంటే భద్రతా నిబంధనల ప్రకారం ఎంబసీ ఆ పరంగానివ్వదు. దీంతో అక్కడే ఆటోలో ఉన్న ఓ డ్రైవర్ “మీ బ్యాగ్ నాకు ఇవ్వండి, ఇది నా డైలీ ఛార్జీ – రూ.1000” అని చెబుతాడు. ఇలా రోజుకు 20–30 మంది నుంచి బ్యాగులు తీసుకొని ఉంచడం ద్వారా రోజుకు రూ.20,000–30,000 సంపాదిస్తున్నాడు. ఇది నెలకు లెక్కించుకుంటే రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ వెళ్లొచ్చు. అతను ఎలాంటి యాప్‌లు, టెక్నాలజీని ఉపయోగించకుండా, కేవలం అవసరాన్ని అర్థం చేసుకొని అందుకు పరిష్కారాన్ని ఇచ్చి సంపాదిస్తున్నాడు.

తన సేవలు చట్టబద్ధంగా సాగించేందుకు స్థానిక పోలీసు అధికారులతో భాగస్వామ్యం కూడా కుదుర్చుకున్నాడని సమాచారం. ఆటోలో 30 సంచులు ఉంచడం చట్టబద్ధంగా కుదరకపోవడంతో, ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌ సాయంతో బ్యాగులను అక్కడ భద్రంగా నిల్వ చేస్తూ ఆటోను కేవలం ఒక మొబైల్ లాకర్‌గా వినియోగిస్తున్నాడు. ఇది తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ, కానీ తెలివైన వ్యాపార ఐడియాతో ఎలా లక్షల్లో సంపాదించచ్చో చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. ఇతడు చేస్తుంది తెలిసి అంత ఆశ్చర్య పోతు what an idea sirji అంటూ మాట్లాడుకుంటున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp