MBA CHAI WALA : పది వేలతో ప్రారంభమై రూ.కోట్లకు.. యువకుడి రియల్ స్టోరి..
MBA CHAI WALA : సాధారణంగా చాలా మంది యువతీ యువకులు తమ కలలు సాకారం చేసుకోవాలనుకుంటారు. గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుంటారు కూడా. కానీ ఆచరణలో ఎక్కడో విఫలమై ముందుకు సాగాకుండా అలానే ఉండిపోతారు. మనం తెలుసుకోబోయే స్టోరిలో కూడా ఓ యువకుడు అత్యద్భుతమైన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాడు కాని ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయాడు. అంత మాత్రాన సదరు యువకుడు ఆగిపోలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆగిపోకుండా వాటన్నిటినీ తట్టుకుని నిలబడి ముందుకు సాగాడు.మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రఫుల్ బిల్లోర్‌కు ఐఐఎంలో చదవాలనేది కల. అందుకుగాను ప్రఫుల్ బిల్లోర్ క్యాట్ ఎగ్జామ్ కోసమై ప్రిపేర్ అయ్యాడు. ఎగ్జామ్‌లో క్వాలిఫై అవాలని అనుకుని కష్టపడి చదివాడు. మూడు సార్లు ప్రయత్నించాడు.
కాని పరీక్షలో అనర్హుడవుతూనే వచ్చాడు. దాంతో అతడు ఎడ్యుకేషన్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే, అతడి లోపల ఐఐఎం లక్ష్యం అలానే ఉండిపోయింది. బిజినెస్ ఐడియా లక్ష్యంతో ముందుకు సాగాలనుకుని చాయ్ దుకాణం పెట్టాడు. ‘ఎంబీఏ చాయ్ వాలా’ అనే పేరు పెట్టి దుకాణం స్టార్ట్ చేసి సదరు యువకుడు ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు. ఇక అతడు ఈ వ్యాపారం స్టార్ట్ చేసేందుకుగాను తొలుత తన తండ్రి దగ్గరి నుంచి రూ.పది వేలు చదువు కోసమని చెప్పి తీసుకున్నాడు. ఐఐఎంలో ఎంబీఏ చేయాలన్న కల నెరవేరనప్పటికీ ఐఐఎం ఎదుటే చాయ్ షాప్ పెట్టి సక్సెస్ అయ్యాడు ప్రఫుల్. దేశవ్యాప్తంగా సదరు యువకుడికి ప్రజెంట్ 22 చాయ్ స్టాల్స్ ఉండటం విశేషమని చెప్పొచ్చు.
MBA CHAI WALA : ఐఐఎంలో చదవలేకపోయినా.. దాని ఎదుటే షాప్..
ఎంబీఏ చాయ్ వాలా షాపును అహ్మదాబాద్ ఐఐఎం సమీపంలో పెట్టగా, అక్కడ విద్యార్థులతో ప్రఫుల్ ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతుంటాడు. అలా వారు ఈ షాపునకు అట్రాక్ట్ అవ్వడంతో షాప్ బాగా క్లిక్ అయింది. అయితే, ఆ తర్వాత కొద్ది రోజులకే అక్కడ షాపు ఉండకూడదని మున్సిపల్ ఆఫీసర్స్ ‘ఎంబీఏ చాయ్ వాలా’ షాపు తొలగించగా, ఇంకో చోట పెట్టుకున్నాడు ప్రఫుల్. ఇకపోతే ప్రఫుల్ బిల్లోర్ హాస్పిటల్ సమీపంలో పెట్టే ‘ఎంబీఏ చాయ్ వాలా’ షాపులకు కూడా బాగా డిమాండ్ ఉందట. అయితే, అందరిలా సంప్రదాయ ఆలోచనలు కాకుండా భిన్నంగా, వినూత్నమైన ఆలోచనలు ఉండటం వల్లే అతి తక్కువ కాలంలోనే రూ.పదివేలతో స్టార్ట్ అయి ప్రఫుల్ బిల్లోర్ నేడు కోటీశ్వరుడయ్యాడని పలువురు అంటున్నారు. అందరు వెళ్లే దారిలో వెళ్లకుండా డిఫరెంట్ రూట్‌లో తన కుమారుడు సక్సెస్ అయ్యాడని ప్రఫుల్ తండ్రి చెప్తున్నారు.