Business idea : సొంతంగా నెయ్యి తయారు చేసి అమ్ముతూ నెలకు 50 వేలు సంపాదిస్తున్న అంధురాలు.. ఎక్కడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business idea : సొంతంగా నెయ్యి తయారు చేసి అమ్ముతూ నెలకు 50 వేలు సంపాదిస్తున్న అంధురాలు.. ఎక్కడో తెలుసా?

Business idea : కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన గీతా సలీష్‌కు తన పద మూడేళ్ల వయసులో కంటి చూపు మందగించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా… అరుదైన జన్యు సంబంధ సమస్య అయిన రెటినిటిస్ పిగ్మెంటోసా సోకిందని తెలిపారు. అప్పటి నుంచి ఆమెకు మెళ్లి మెళ్లిగా కంటి చూపు మందగిస్తూ వచ్చింది. గీత పది హేనేళ్లకు చేరుకునే లోపు పూర్తిగా కంటి చూపు పోయి అంధురాలైంది. కానీ ఆమె కుంగి పోలేదు. తన లక్ష్యాన్ని […]

 Authored By jyothi | The Telugu News | Updated on :24 February 2022,8:20 am

Business idea : కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన గీతా సలీష్‌కు తన పద మూడేళ్ల వయసులో కంటి చూపు మందగించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా… అరుదైన జన్యు సంబంధ సమస్య అయిన రెటినిటిస్ పిగ్మెంటోసా సోకిందని తెలిపారు. అప్పటి నుంచి ఆమెకు మెళ్లి మెళ్లిగా కంటి చూపు మందగిస్తూ వచ్చింది. గీత పది హేనేళ్లకు చేరుకునే లోపు పూర్తిగా కంటి చూపు పోయి అంధురాలైంది. కానీ ఆమె కుంగి పోలేదు. తన లక్ష్యాన్ని వదులు కోలేదు. చిన్నప్పటి నుంచే బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిర పడాలని కలల కన్న గీత… అందు కోసం ఎంత గానో కృషి చేసింది. బ్రెయిలీ లిపి నేర్చుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి ఆమె మెడికల్ రిప్రజెంటేటివ్, డిస్ట్రిబ్యూటర్ అయిన సలీష్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలతోనే సంవత్సరాలు గడిచిపోయాయి.

కానీ తాను మాత్రం సొంతంగా ఏదైనా చేయాలనుకుంది. కరోనా కారణంగా లాక్ డౌన్ రావడంతో… ఆన్ లైన్ లో ఆహారం విక్రయించాలనే ఆలోచన వచ్చింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. అందుకు ఒప్పుకున్న ఆయన సహకారంతో ఇంట్లోనే నెయ్యి, ఊరగాయలు, పసుపుతో వంటకాలు చేసి ఆన్ లైన్ లో అమ్మాలని నిర్ణయించుకుంది. 2020లో తన భర్త సలీష్ కుమార్ తో కలిసి గీతాస్ హోమ్ టు హోమ్ ని ప్రారంభించింది. అయితే గీత ప్రత్యేకమైన ఓ వంటకాన్ని తయారు చేసింది. ప్రసవం తర్వాత స్త్రీలు గట్టిపడేందుకు ఉపయోగపడే పసుపు, ఖర్జూరం, బాదం, కొబ్బరి పాలు, బెల్లంతో ఓ వినూత్న వంటకాన్ని తయారు చేసింది. దానికి కర్కుమీల్‌ అనే పేరు పెట్టి.. ఆన్ లైన్ వేదికగా అమ్మకం ప్రారంభించింది. ఈ వంటకం రుచి బాగుండటం… హెల్తీ కూడా కావడంతో చాలా మంది దీనిని కొనేందుకు ఆసక్తి కనబర్చారు.

kerala blind women starts online business sells superfood supplement

kerala blind women starts online business sells superfood supplement

అయితే 500 గ్రాముల విలువ చేసే ఈ కరుకుమీన్ ధర 600 రూపాయలు. అయితే దీనిని చిన్న పిల‌్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరైనా తీసుకోవచ్చట. అంతే కాదు పొడి రూపంలో, నేరుగా తినొచ్చేలాగా కూడా ఉంటుంది. పొడి అయితే పాలల్లో కలుపుకొని తాగాలి. దేశ వ్యాప్తంగా ఈ కర్కుమీల్‌ కు గిరాకీ ఎక్కువ. అయితే ఈ వ్యాపారం ద్వారా నెలకు 50 వేల రూపాయలను సంపాదిస్తోంది గీత. “నేను నా స్వంతంగా ఏదైనా ప్రారంభించాలనుకున్నాను. దృష్టి లోపం నన్ను ఎప్పుడూ ఆపలేదు. నా భర్త మరియు నా పిల్లలు ఎల్లప్పుడూ నాకు సహకరించారు. అన్ని వేళలా నాకు మద్దతు ఇచ్చారు ” అని గీత చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం గీత, ఆమె భర్త సలీష్ లు త్రిస్సూర్‌లో ఒక చిన్న రెస్టారెంట్‌ను నడిపేవారు. దాని వ

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది