Beauty Tips : ప్రస్తుత కాలంలో మహిళలు, పురుషులు అందం మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. అందంగా కనిపించాలి అంటూ చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అందంగా కనిపించడం కోసం ఫేషియల్, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ పూర్వం ఇలాంటి బ్యూటీ పార్లర్ చేసేవి కూడా ఉండేవి కాదు అప్పటి వారు వంటింట్లో దొరికే వాటితోనే ఫేషియల్స్ వంటివి చేసుకునేవారు. ముఖం అందంగా కనిపించాలి అంటూ చాలా ఫేస్ క్రీమ్ చేసుకుంటారు అలా రాసుకోవడం వల్ల మన ముఖంలో సున్నితమైన పెదవులకు చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి అయితే పెదవులు నలుపురంగులో కనిపిస్తూ ఉంటాయి ఈ నలుపు రంగు తగ్గించుకొని పెదవులను మంచి గులాబీ వర్ణంలోకి తీసుకురావడానికి
ఈ చిట్కాను తప్పకుండా పాటించాల్సిందే.ముఖ్యంగా పెదవులు శీతాకాలంలో పగుళ్లు రావడం పొడిబారడం సమస్యలు ఎదురవుతాయి అందుకే నల్లగా మారిన పెదవుల కోసం ఈ చిట్కా పెదవులు గులాబీ వర్ణంలోకి మారడానికి ఒక స్పూన్ పంచదారలో ఆలివ్ ఆయిల్ ను తీసుకోవాలి ఒకవేళ ఆలివ్ ఆయిల్ అందుబాటులో లేకపోతే కొబ్బరి ఆయిల్ లేదా బాదం ఆయిల్ ను తీసుకోవచ్చు. ఒక స్పూన్ తేనె కూడా వేసుకోవాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తరువాత దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఇది దాదాపు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది.తరువాత ఇంకొక చిట్కా కోసం దాల్చిన చెక్క పొడి, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి ఆయిల్ ను తీసుకొని, ఇందులోకి వ్యాస్లీన్ పెట్రోలియం జెల్లీ వేసుకొని ఈ మూడింటిని కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ మూడు పదార్థాలని కలిపిన చిన్న గిన్నెను నీటి మధ్యలో పెట్టి డబుల్ బాయిలింగ్ పద్ధతి లో వేడి చేసుకోవాలి. దీన్ని చల్లార్చిన తరువాత ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఇలా తయారుచేసిన వీటితో ప్రతిరోజు ముందుగా మనం తయారుచేసుకున్న స్క్రాబ్ తో పెదాలను ఒక నిమిషం పాటు స్క్రాబ్ చేసుకోవాలి. తరువాత పెదవులను శుభ్రం చేసి మనం చేసుకున్న ఈ పేస్ట్ ను పెదవులకు అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల పెదవుల మీద ఉన్న మృతకణాలు తగ్గిపోయి గులాబీ వర్ణంలోకి పెదవులు మారుతాయి. ఇందులో మనం ఎలాంటి కలర్ ఉపయోగించడం లేదు కాబట్టి ఎలాంటి హాని కలగదు. దీనిని పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.