New Changes : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక మార్పులు .. లాభనష్టాల వివరాలివే .. !

 Authored By sudheer | The Telugu News | Updated on :30 March 2026,10:30 am

ప్రధానాంశాలు:

  •  New Changes : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక మార్పులు .. లాభనష్టాల వివరాలివే .. !

New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. పన్ను వ్యవస్థ నుంచి జీతాల నిర్మాణం వరకు, బ్యాంకింగ్ నుంచి ప్రయాణ నిబంధనల వరకు అనేక అంశాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇవి సామాన్యుడి రోజువారీ జీవితంపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమైన మార్పులను సులభంగా అర్థమయ్యేలా మీ కోసం ప్రత్యేకంగా సమగ్ర వివరాలు.

New financial changes from April 1

New financial changes from April 1

New Changes : పన్ను వ్యవస్థలో సరళీకరణ .. ‘ట్యాక్స్ ఇయర్’ ప్రారంభం

ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ వంటి పదాలతో పన్ను చెల్లింపుదారులు గందరగోళానికి గురయ్యేవారు. అయితే ఇకపై ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే కాలాన్ని నేరుగా ‘ట్యాక్స్ ఇయర్’గా పిలవనున్నారు. ఇది పన్ను వ్యవస్థను మరింత సులభతరం చేసే దిశగా తీసుకున్న కీలక నిర్ణయం. పన్ను రేట్లలో పెద్దగా మార్పులు లేకపోయినా నిబంధనలను సామాన్యుడికి అర్థమయ్యేలా రూపొందించారు. దీనివల్ల పన్ను దాఖలు ప్రక్రియ సులభమవడంతో పాటు అవగాహన కూడా పెరుగుతుంది. నగరాల్లో పెరుగుతున్న అద్దెలను దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఆర్‌ఏ HRA మినహాయింపును కూడా విస్తరించారు. హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ వంటి నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది ఊరటగా మారనుంది. అయితే అద్దె చెల్లింపులపై ఇంటి యజమాని పాన్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి చేశారు.

New Changes : జీతాలు, పీఎఫ్‌లో మార్పులు .. ఉద్యోగులకు లాభనష్టాలు

కొత్త లేబర్ కోడ్ అమలు నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్‌ను సవరించాల్సి ఉంటుంది. మొత్తం జీతంలో బేసిక్ శాలరీ కనీసం 50% ఉండాలని నిబంధన పెట్టారు. దీని ప్రభావంగా పీఎఫ్ PF కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. దీంతో భవిష్యత్తు కోసం పొదుపు పెరుగుతుందనేది ఒక సానుకూల అంశం. అయితే చేతికి వచ్చే నికర జీతం కొంత తగ్గే అవకాశం ఉంది. ఈ మార్పులు ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ రంగం ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక పాన్ కార్డు వినియోగం కూడా విస్తరించబడింది. రూ.5 లక్షలకు పైగా విలువైన వాహనాల కొనుగోలు రూ.1 లక్షకు పైగా హోటల్ బిల్లులు, సంవత్సరానికి రూ.10 లక్షలకు పైగా బ్యాంక్ డిపాజిట్లు ఇలాంటి అన్ని లావాదేవీలకు పాన్ తప్పనిసరి చేశారు. బీమా పాలసీలకు కూడా పాన్ అవసరం అవుతుంది.

New Changes : ప్రయాణం, ఇంధనం, ట్రేడింగ్ .. కొత్త నిబంధనలు

రైల్వే ప్రయాణికులకు టికెట్ రద్దుపై కొత్త నియమాలు అమల్లోకి వస్తున్నాయి. ఇకపై రైలు బయల్దేరడానికి కనీసం 8 గంటల ముందు టికెట్ రద్దు చేస్తేనే రిఫండ్ లభిస్తుంది. అంతకంటే ఆలస్యంగా రద్దు చేస్తే డబ్బులు తిరిగి రాకపోవచ్చు. ఇక ట్రేడర్లకు ఫ్యూచర్స్ , ఆప్షన్స్ F&O లావాదేవీలపై ఎస్‌టిటి STT భారం పెరగనుంది. గ్యాస్ సిలిండర్ ధరలు కూడా ఏప్రిల్ 1న సవరించబడతాయి. ఇంధన రంగంలో మరో పెద్ద మార్పు E20 పెట్రోల్ అమలు. అంటే 20% ఇథనాల్ కలిగిన పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా తప్పనిసరి చేస్తున్నారు. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా ఇంధన వినియోగంలో స్వదేశీకరణను పెంచుతుంది. ఇంధన నాణ్యతను కూడా మెరుగుపరచడానికి RON 95 ప్రమాణాన్ని అమలు చేస్తున్నారు. ఈ మార్పులన్నీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కాబట్టి వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. కొత్త నిబంధనలను అర్థం చేసుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ మార్పులను మన ప్రయోజనానికి ఉపయోగించుకోవచ్చు.

Also read

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి