Business Ideas : గుజరాత్‌కు చెందిన హిమాన్షు, తన్వి పటేల్ దంపతులు స్వాద్య అనే ఆర్గానిక్ ముడి తేనెను విక్రయిస్తూ నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తున్నారు. హిమాన్షు జేఎఎస్ డబ్ల్యూ పవర్ ప్లాంటులో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. తన్వి ఓ స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. ఈ దంపతులు తమ ఉద్యోగాలను వదులుకుని సేంద్రియ వ్యవసాయం వైపు వచ్చారు. హిమాన్షు, తన్వికి ఉన్న వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్న రైతు ఒకరు.. తాను సాగు చేయడానికి అధికంగా రసాయనాలు వినియోగించాడు. దాంతో భూమి పూర్తిగా సారం కోల్పోయే స్థితికి వచ్చింది. ఇది తెలుసుకున్న పటేల్ దంపతులు.. తమ ఉద్యోగాలను వదిలేసి వ్యవసాయం వైపు మళ్లాలని నిర్ణయించుకున్నారు. 2019లో వీరిద్దరూ తమ సేంద్రీయ వ్యవసాయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
హానికరమైన పురుగు మందులకు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నప్పుడు వారికి తేనెటీగల పెంపకం గురించి తెలిసింది. పంటలు మరియు కూరగాయలు తగినంత పరాగసంపర్కాన్ని పొందినట్లయితే, పెరుగుదల వేగంగా ఉంటుందని గ్రహించారు. మొదట కృషి విజ్ఞాన కేంద్రం నుండి తేనెటీగల పెంపకంలో శిక్షణ పొందారు. అనంతరం తేనెటీగల పెంపకం వైపు వచ్చారు. రూ. 3.6 లక్షలు పెట్టుబడిగా పెట్టి తేనెటీగల పెంపకం ప్రారంభించారు. తేనెటీగలు రసాయనాలు పీల్చితే తక్షణమే చనిపోతాయి. హిమాన్షు, తన్వి పొలం చుట్టు పక్కల రైతులందరూ దిగుబడి పెంచుకునేందుకు రసాయనాలు ఎక్కువగా వాడే వారు. దాంతో ఈ రసాయనాలను పీల్చడంతో ఆ హిమాన్షు, తన్వికి చెందిన తేనెటీగలన్నీ చనిపోయాయి. పెట్టుబడిగా పెట్టిన డబ్బులు మొత్తం కోల్పోవాల్సి వచ్చింది.
తర్వాత సీజన్ వచ్చే నాటికి తేనెటీగల పెట్టెల స్థలాన్ని మార్చారు. అలాగే దాని చుట్టు పక్కల ఉన్న రైతులను రసాయనాలు వాడొద్దని అభ్యర్థించారు. ఈసారి పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో పెట్టెలు పెట్టారు. ఇది మెల్లిగా ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించింది. దాంతో పెట్టెల సంఖ్యను 100కు ఆపై 500 వరకు పెంచారు. తేనెటీగలకు మెయింటెనెన్స్ పెద్దగా ఉండదని, కానీ ఆఫ్ సీజన్ లో వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రం చక్కెర సిరప్, పండ్ల రసాలు, మరియు బెల్లం నీళ్లు ఇవ్వాలని చెబుతున్నారు ఆ దంపతులు. ప్రతి నెలా దాదాపు 300 కిలోల తేనెను విక్రయిస్తున్నారు. సగటున నెలకు రూ. 9 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు లాభం పొందుతున్నారు హిమాన్షు, తన్వి దంపతులు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.