Business Ideas : ఆర్గానిక్ తేనె అమ్ముతూ నెలకు 12 లక్షలు సంపాదిస్తున్న యువ జంట.. ఎక్కడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business Ideas : ఆర్గానిక్ తేనె అమ్ముతూ నెలకు 12 లక్షలు సంపాదిస్తున్న యువ జంట.. ఎక్కడో తెలుసా?

Business Ideas : గుజరాత్‌కు చెందిన హిమాన్షు, తన్వి పటేల్ దంపతులు స్వాద్య అనే ఆర్గానిక్ ముడి తేనెను విక్రయిస్తూ నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తున్నారు. హిమాన్షు జేఎఎస్ డబ్ల్యూ పవర్ ప్లాంటులో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. తన్వి ఓ స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. ఈ దంపతులు తమ ఉద్యోగాలను వదులుకుని సేంద్రియ వ్యవసాయం వైపు వచ్చారు. హిమాన్షు, తన్వికి ఉన్న వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్న రైతు ఒకరు.. తాను సాగు […]

 Authored By jyothi | The Telugu News | Updated on :10 March 2022,12:00 pm

Business Ideas : గుజరాత్‌కు చెందిన హిమాన్షు, తన్వి పటేల్ దంపతులు స్వాద్య అనే ఆర్గానిక్ ముడి తేనెను విక్రయిస్తూ నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తున్నారు. హిమాన్షు జేఎఎస్ డబ్ల్యూ పవర్ ప్లాంటులో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. తన్వి ఓ స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. ఈ దంపతులు తమ ఉద్యోగాలను వదులుకుని సేంద్రియ వ్యవసాయం వైపు వచ్చారు. హిమాన్షు, తన్వికి ఉన్న వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్న రైతు ఒకరు.. తాను సాగు చేయడానికి అధికంగా రసాయనాలు వినియోగించాడు. దాంతో భూమి పూర్తిగా సారం కోల్పోయే స్థితికి వచ్చింది. ఇది తెలుసుకున్న పటేల్ దంపతులు.. తమ ఉద్యోగాలను వదిలేసి వ్యవసాయం వైపు మళ్లాలని నిర్ణయించుకున్నారు.  2019లో వీరిద్దరూ తమ సేంద్రీయ వ్యవసాయ ప్రయాణాన్ని ప్రారంభించారు.

హానికరమైన పురుగు మందులకు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నప్పుడు వారికి తేనెటీగల పెంపకం గురించి తెలిసింది. పంటలు మరియు కూరగాయలు తగినంత పరాగసంపర్కాన్ని పొందినట్లయితే, పెరుగుదల వేగంగా ఉంటుందని గ్రహించారు. మొదట కృషి విజ్ఞాన కేంద్రం నుండి తేనెటీగల పెంపకంలో శిక్షణ పొందారు. అనంతరం తేనెటీగల పెంపకం వైపు వచ్చారు. రూ. 3.6 లక్షలు పెట్టుబడిగా పెట్టి తేనెటీగల పెంపకం ప్రారంభించారు. తేనెటీగలు రసాయనాలు పీల్చితే తక్షణమే చనిపోతాయి. హిమాన్షు, తన్వి పొలం చుట్టు పక్కల రైతులందరూ దిగుబడి పెంచుకునేందుకు రసాయనాలు ఎక్కువగా వాడే వారు. దాంతో ఈ రసాయనాలను పీల్చడంతో ఆ హిమాన్షు, తన్వికి చెందిన తేనెటీగలన్నీ చనిపోయాయి. పెట్టుబడిగా పెట్టిన డబ్బులు మొత్తం కోల్పోవాల్సి వచ్చింది.

organic honey selling 12 lakhs per month Business Idea in bhuvaneshwari

organic honey selling 12 lakhs per month Business Idea in Himanshu and Tanvi Patel couples

తర్వాత సీజన్ వచ్చే నాటికి తేనెటీగల పెట్టెల స్థలాన్ని మార్చారు. అలాగే దాని చుట్టు పక్కల ఉన్న రైతులను రసాయనాలు వాడొద్దని అభ్యర్థించారు. ఈసారి పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో పెట్టెలు పెట్టారు. ఇది మెల్లిగా ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించింది. దాంతో పెట్టెల సంఖ్యను 100కు ఆపై 500 వరకు పెంచారు. తేనెటీగలకు మెయింటెనెన్స్ పెద్దగా ఉండదని, కానీ ఆఫ్ సీజన్ లో వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రం చక్కెర సిరప్, పండ్ల రసాలు, మరియు బెల్లం నీళ్లు ఇవ్వాలని చెబుతున్నారు ఆ దంపతులు. ప్రతి నెలా దాదాపు 300 కిలోల తేనెను విక్రయిస్తున్నారు. సగటున నెలకు రూ. 9 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు లాభం పొందుతున్నారు హిమాన్షు, తన్వి దంపతులు.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది