Petrol Bunk Business : పెట్రోల్ బంకు వ్యాపారంతో లాభమా? నష్టమా? ఖర్చు ఎంతవుతుందంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Petrol Bunk Business : పెట్రోల్ బంకు వ్యాపారంతో లాభమా? నష్టమా? ఖర్చు ఎంతవుతుందంటే?

 Authored By mallesh | The Telugu News | Updated on :7 February 2022,6:00 pm

Petrol Bunk Business : ఇటీవల కాలంలో చాలా మంది ఉద్యోగాలు చేసే బదులు వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా మంది ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే అందరూ బిజినెస్ ఐడియాస్ కోసం వెతుకుతున్నారు. ఏదేని చిన్న వ్యాపారమైనా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయి స్టార్ట్ చేస్తున్నారు కూడా. కాగా, అలా అందరికీ వచ్చే ఎవర్ గ్రీన్ ఐడియాస్ లో పెట్రోల్ బంక్ పెట్టాలని థాట్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ ప్రస్తుతం వెహికల్స్ ఉంటున్నాయి. ఇకపోతే వాహనాల్లో కంపల్సరీగా పెట్రోల్ లేదా డీజిల్ కంపల్సరీ. కాగా, ఈ వ్యాపారం పెట్టడం మంచిదా? కాదా? అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.పెట్రోల్ బంక్ పెట్టాలనుకోవడం మంచి ఆలోచనే అని కొందరు పెద్దలు అంటున్నారు.

ఎందుకంటే ఒకప్పుడు పెట్రోల్ బంకులు పెట్టిన వాళ్లు ఇప్పుడు అత్యంత ధనికులుగా ఉన్నారని ఎగ్జాంపుల్స్ చెప్పున్నారు కూడా. కానీ, పెట్రోల్ బంక్ పెట్టాలంటే కనీసంగా కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్ అయితే కావాలి. ఉదాహరణకు ఓ పెట్రోల్ బంక్ పెట్టాలంటే కనీసంగా రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుందని కొందరు అంటున్నారు.అలా మినిమమ్ ఇన్వెస్ట్ మెంట్ గా రూ.2 కోట్లు చేస్తేనే సెటప్ సాధ్యమవుతుంది. అలా పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి పర్మిషన్స్, సేఫ్టీ మెజర్ మెంట్స్ తో పాటు అనుమతుల కోసం కొందరికి లంచాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే జనావాసాల మధ్య పెట్రోల్ బంక్ లు పెట్టరాదు అంటూ అనుమతులు ఆలస్యం చేసే ప్రమాదం ఉంటుంది.

petrol bunk business is good or bad

petrol bunk business is good or bad

Petrol Bunk Business : ఈ వ్యాపారం స్టార్ట్ చేయడం కష్టమేనా..?

అలా మీరు కంపల్సరీగా కొంత ఖర్చు పెట్టుకుంటేనే మీకు అనుకున్న టైంలో అనుమతులు వచ్చే చాన్సెస్ ఉంటాయి.రాజకీయ నాయకుల అండదండలు కూడా అవసరమే. ఎందుకంటే ఉదాహారణకు ఏదేని పొలిటికల్ పార్టీ బైక్ ర్యాలీ, లేదా కారు ర్యాలీ తీసినపుడు ఆయా బండ్లు తమ పెట్రోల్ బంకుకు రావాలనేలా డీల్ మాట్లాడుకుంటే బోలెడంత లాభం ఉంటుంది. ఈ క్రమంలోనే పెట్రోల్ బంక్ స్టార్టింగ్ టైంలో అవసరమైన సాయం కూడా పొలిటికల్ లీడర్స్ చేసే చాన్సెస్ ఉంటాయి. అయితే, ఈ వ్యాపారం మొత్తంగా మంచి లాభమే చూపుతుందని, అయితే, ఇందుకుగాను అర్థబలం, అంగ బలం కావాలని అంటున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది