Post Office : పోస్టాఫీస్‌లో అదిరిపోయే ఆఫర్.. రూ.550 కడితే రూ. 10 లక్షల బెనిఫిట్..!
ప్రధానాంశాలు:
Post Office : పోస్టాఫీస్‌లో అదిరిపోయే ఆఫర్.. రూ.550 కడితే రూ. 10 లక్షల బెనిఫిట్..!
Post Office : ఈ రోజుల్లో సామాన్యులకి అండగా అనేక స్కీమ్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిలో పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ , రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా వ్యక్తిగత ప్రమాద బీమా పథకం పట్టణ, పల్లె ప్రజలకు అతి తక్కువ ప్రీమియంతో అత్యధిక భద్రత కోసం తక్కువ ఖర్చుతో తీసుకువచ్చాయి. ఈ క్రమంలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ , ఇండియా పోస్టు భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రమాద భీమా పథకం ప్రవేశపెట్టింది.

Post Office : పోస్టాఫీస్‌లో అదిరిపోయే ఆఫర్.. రూ.550 కడితే రూ. 10 లక్షల బెనిఫిట్..!
Post Office : మంచి స్కీమ్..
ఈ పథకం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది అందులో మొదటిది 550 రూపాయల ప్రీమియంతో రూ. 10 లక్షల కవరేజ్, రెండవది 350 రూపాయల ప్రీమియంతో రూ. 5 లక్షల కవరేజ్ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ప్రధాన ప్రయోజనాలు ఆసుపత్రి ఖర్చులు (ఇన్‌పేషెంట్),శాశ్వత , తాత్కాలిక వికలాంగతకు భీమా,అంబులెన్స్ ఖర్చులు,మాతృత్వ ప్రయోజనాలు, పిల్లల విద్యా ప్రోత్సాహం, యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిసేబిలిటీ, ప్రమాదంలో మరణించినప్పుడు, ఇతర ఆరోగ్య ప్రయోజనాలు
హాస్పిటల్ నిబంధన ఖర్చులు రూ. 500 (10 లక్షల పాలసీకి మాత్రమే) యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ రూ. 1,00,000 (10 లక్షల పాలసీకి),పిల్లల విద్యా సహాయం రూ. 1,00,000 (10 లక్షల పాలసీకి),స్మశాన వెచ్చింపు ఖర్చు రూ. 5000,ఓ.పి.డి ప్రయోజనాలు (కేవలం 10 లక్షల పాలసీకి), ప్రసూతి బెనిఫిట్ 2500 ఉన్నాయని తెలియజేశారు. ఐదు లక్షల పాలసీ తీసుకున్నవారు శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన లేదంటే ప్రమాదశాత్తు మరణిస్తే 5లక్షల బీమా నామిని కి వర్తిస్తుంది. మరిన్ని వివరాల కోసం మీ స్థానిక పోస్టాఫీస్‌ను సంప్రదించండి అని తెలిపారు.