Pushpa 2 The Rule : స్టాక్ మార్కెట్‌ని కూడా ప‌రుగులు పెట్టిస్తున్న పుష్ప‌2.. ఒక్క స్టాక్‌తో లక్షలే లక్షలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa 2 The Rule : స్టాక్ మార్కెట్‌ని కూడా ప‌రుగులు పెట్టిస్తున్న పుష్ప‌2.. ఒక్క స్టాక్‌తో లక్షలే లక్షలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 December 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Pushpa 2 The Rule : స్టాక్ మార్కెట్‌ని కూడా ప‌రుగులు పెట్టిస్తున్న పుష్ప‌2.. ఒక్క స్టాక్‌తో లక్షలే లక్షలు..!

Pushpa 2 The Rule : ఇప్పుడు ఎక్క‌డ చూసిన కూడా పుష్ప హంగామా న‌డుస్తుంది. పుష్ప చిత్రం అతి పెద్ద విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు పుష్ప‌2పై కూడా అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అల్లు అర్జున్ – సుకుమార్ క్రేజీ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 1 కి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 . ఈ సినిమాలో అల్లు అర్జున్ Allu Arjun సరసన రష్మిక మందన్న Rashmika mandanna హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అయినా ఐటెం సాంగ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల మాస్ స్టెప్పులేసింది. అలాగే.. ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ, సునీల్‌, అనసూయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా.. తమన్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అందించారు.

Pushpa 2 The Rule స్టాక్ మార్కెట్‌ని కూడా ప‌రుగులు పెట్టిస్తున్న పుష్ప‌2 ఒక్క స్టాక్‌తో లక్షలే లక్షలు

Pushpa 2 The Rule : స్టాక్ మార్కెట్‌ని కూడా ప‌రుగులు పెట్టిస్తున్న పుష్ప‌2.. ఒక్క స్టాక్‌తో లక్షలే లక్షలు..!

Pushpa 2 The Rule పుష్ప‌2 మానియా..

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. అంతకముందు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగింది. డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా చిత్ర నిర్మాతలు దాదాపు రూ.25 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. అడ్వాన్స్‌ బుకింగ్‌ బట్టి తొలిరోజు ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో రూ.150 నుంచి రూ. 200 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టవచ్చునని అంచనా. ఈ రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్‌తో థియేటర్ స్టాక్ పీవీఆర్ ఐనాక్స్ షేర్లు దాదాపు 3 శాతం పెరిగాయి. దీని కారణంగా కొన్ని నిమిషాల్లోనే కంపెనీ మార్కెట్ క్యాప్‌లో రూ.426 కోట్ల పెరుగుదల కనిపించింది. బిజినెస్ నిపుణుల అంచనా ప్రకారం, పుష్ప-2 పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

పుష్ప-2తో థియేటర్లకు భారీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉండటమే కాదు.. ఆదాయం పెరిగి ఆయా కంపెనీ షేర్లు లాభాల బాట పడతాయని అంటున్నారు. నిన్న‌టి నిన్నటి ట్రేడింగ్ సెషన్ stock market లో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు దాదాపు 3 శాతం పెరిగాయి. ఈ కంపెనీ షేర్లు కూడా రోజు గరిష్ఠ స్థాయి రూ.1583.40కి చేరాయి. ఈ రోజు, రేపు, వచ్చే వారం కూడా ఈ షేర్లపై పుష్ప- 2 ప్రభావం ఖచ్చితంగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం రికార్డు స్థాయిలో రూ. 39.90 మేరకు పెరిగి.. చివరి సెషన్‌లో రూ. 1579.95 వద్ద ముగిశాయి. ఇక డిసెంబర్ 18, 2023న ఈ కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,829కి చేరాయి. ప్రస్తుతం కంపెనీ షేర్లు రికార్డు స్థాయి కంటే దాదాపు 14 శాతం దిగువన ఉన్నాయి . Pushpa 2 The Rule buy pvr inox shares say stock analysts , Allu Arjun, Rashmika mandanna

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది