Business Idea : మట్టి లేకుండా పంట .. లక్షల్లో ఆదాయం …!
Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పుడు చాలామంది వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సాంప్రదాయం వ్యవసాయం కాకుండా ఆధునిక వ్యవసాయం చేస్తూ లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. సాధారణంగా ఏ పంట పండాలన్న ఆ నేలలో మట్టి చాలా ముఖ్యమైనది. నేల సారవంతమైనదైతే పంట బాగా పండుతుంది. అయితే ఇక్కడ ఒక రైతు మట్టి లేకుండానే కుంకుమపువ్వును పండిస్తున్నాడు. మనకు తెలిసిందే కుంకుమపువ్వు ఎంత ఖరీదైనదో. అలాంటి దాన్ని మట్టి లేకుండా పండిస్తున్నాడు.
మహారాష్ట్రలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సరికొత్త పద్ధతిలో కుంకుమపువ్వు సాగు చేస్తున్నాడు. శైలేష్ మోదక్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. ఏరోపోనిక్ విధానంలో ఇప్పటికే స్ట్రాబెరీ, కూరగాయలను పండిస్తున్నాడు. అలాగే ఇప్పుడు కుంకుమపువ్వుని కూడా పండిస్తున్నాడు. శైలేష్ చెప్పిన వివరాల ప్రకారం.. షిప్పింగ్ కంటైనర్లలో కుంకుమపువ్వులు సాగు చేస్తున్నాడట. మట్టి అవసరం లేకుండా హైడ్రోపోనిక్ విధానాన్ని అనుసరిస్తున్నాడు. ఈ పద్ధతిలో ఇప్పటికే కూరగాయలు స్ట్రాబెర్రీలను కూడా పండించాడు. ఇప్పుడు కుంకుమపువ్వు సాగు చేస్తున్నాడు. కుంకుమపువ్వు కోసం 10 లక్షల పెట్టుబడి పెట్టాడు.
కాశ్మీర్ నుంచి విత్తనాలను తీసుకొచ్చి 160 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏరోపోనిక్ టెక్నాలజీతో కుంకుమపువ్వు సాగు చేస్తున్నాడు శిలేష్. ఏరోపోనిక్ విధానం అంటే చిన్న చిన్న నీటి తుంపర్ల సాయంతో వ్యవసాయం చేయడం. ఈ తుంపర్లతో పొగ మంచు ఏర్పడుతుంది. దీని నుంచే మొక్కకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఏరోపోనిక్ విధానంలో వ్యవసాయం చేస్తే తక్కువ ప్రదేశంతో, తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఈ టెక్నాలజీ చాలా దేశాల్లో ఉంది. ఇప్పుడిప్పుడే మన దేశంలో కొందరు యువ రైతులు ఏరోపోనిక్ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. అలాగే అధిక ఆదాయాన్ని పొందుతున్నారు.