Scorpion Business : ప్రస్తుతం సోషల్ మీడియాలో తేలు విషం బిజినెస్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఏ వన్యప్రాణులని లేదా క్రూరమృగాలని పెంచిన రాని ఆదాయం విషపూరితమైన కీటకాలను పెంచితే వస్తుందని వార్త వైరల్ అవుతుంది. కోళ్లు పెంచినట్లుగానే తేళ్లను కూడా పెంచి వాటి నుంచి విషం తీసి కోట్లలో సంపాదిస్తున్నారు. తేళ్లలో ఉండే విషం అత్యంత ఖరీదైనదిగా తేలడంతో తేళ్ల ఫారాలుగా మార్చి అందులో పెంచుతున్నారు. తేలు విషానికి భారీగా డిమాండ్ ఉండడంతో ఈ తేలు పరిశ్రమలు వెలిసినట్లుగా తెలుస్తుంది. మార్కెట్లో తేలు విషం లీటర్ ధరకు 82 కోట్లు పలుకుతుంది. అందుకే తేళ్లను శ్రద్ధగా పెంచుతున్నారు.
సోషల్ మీడియాలో తేళ్లను పెంచేందుకు ఓ పరిశ్రమల ఫారంలో పెంచుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో తేలు చీమల్లా కనిపిస్తున్నాయి. వాటి ఆహారం , నివాసం అన్ని ఏర్పాటు చేసినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. తేలు విషానికి ఇంత డిమాండ్ పెరగడానికి కారణం ఈ తేళ్ల విషాన్ని కాస్మోటిక్ ప్రొడక్ట్స్, కొన్ని రకాల మెడిసిన్స్ తయారీలో ఉపయోగిస్తున్నారట. మరీ ముఖ్యంగా క్యాన్సర్ రోగం నయం చేయడానికి కూడా ఈ తేలు విషాన్ని ఉపయోగిస్తారట. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తేళ్లను పెంచుతున్నారు. ఇక వాటి విషాన్ని ప్రత్యేక పద్దతుల్లో నిల్వ చేస్తున్నారు.
ఇంత డిమాండ్ ఉన్న తేళ్లను పెంచడం కూడా పెద్ద రిస్క్ అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒక్కొక్క తేలు నుంచి రోజుకు రెండు మిల్లీ లీటర్ల విషం ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అయిన విషాన్ని తేలు కొండి నుంచి ట్వీజర్స్ తో పిండి బయటకు తీస్తున్నారు. ఇలా తేలు నుంచి విషాన్ని తీసేటప్పుడు తేలుకు ఎటువంటి హాని జరగకుండా సరికొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. వీడియోలో తేళ్లను కుప్పలు కుప్పలుగా చూస్తుంటే ఒళ్ళు గగ్గుర్పొడుస్తుంది. విషపూరితమైన తేళ్ళను ఎవరికి ఎటువంటి హాని జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తేళ్లఫారం పెంచుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎక్కడిదో తెలియదు. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కైపోతున్నారు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.