Scorpion Business : తేలు విషంతో బిజినెస్ .. కోట్లలో ఆదాయం .. ఎక్కడో తెలుసా ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Scorpion Business : తేలు విషంతో బిజినెస్ .. కోట్లలో ఆదాయం .. ఎక్కడో తెలుసా ..??

 Authored By aruna | The Telugu News | Updated on :9 September 2023,11:00 am

Scorpion Business : ప్రస్తుతం సోషల్ మీడియాలో తేలు విషం బిజినెస్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఏ వన్యప్రాణులని లేదా క్రూరమృగాలని పెంచిన రాని ఆదాయం విషపూరితమైన కీటకాలను పెంచితే వస్తుందని వార్త వైరల్ అవుతుంది. కోళ్లు పెంచినట్లుగానే తేళ్లను కూడా పెంచి వాటి నుంచి విషం తీసి కోట్లలో సంపాదిస్తున్నారు. తేళ్లలో ఉండే విషం అత్యంత ఖరీదైనదిగా తేలడంతో తేళ్ల ఫారాలుగా మార్చి అందులో పెంచుతున్నారు. తేలు విషానికి భారీగా డిమాండ్ ఉండడంతో ఈ తేలు పరిశ్రమలు వెలిసినట్లుగా తెలుస్తుంది. మార్కెట్లో తేలు విషం లీటర్ ధరకు 82 కోట్లు పలుకుతుంది. అందుకే తేళ్లను శ్రద్ధగా పెంచుతున్నారు.

సోషల్ మీడియాలో తేళ్లను పెంచేందుకు ఓ పరిశ్రమల ఫారంలో పెంచుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో తేలు చీమల్లా కనిపిస్తున్నాయి. వాటి ఆహారం , నివాసం అన్ని ఏర్పాటు చేసినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. తేలు విషానికి ఇంత డిమాండ్‌ పెరగడానికి కారణం ఈ తేళ్ల విషాన్ని కాస్మోటిక్‌ ప్రొడక్ట్స్, కొన్ని రకాల మెడిసిన్స్‌ తయారీలో ఉపయోగిస్తున్నారట. మరీ ముఖ్యంగా క్యాన్సర్‌ రోగం నయం చేయడానికి కూడా ఈ తేలు విషాన్ని ఉపయోగిస్తారట. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తేళ్లను పెంచుతున్నారు. ఇక వాటి విషాన్ని ప్రత్యేక పద్దతుల్లో నిల్వ చేస్తున్నారు.

Scorpion venom business Income in crores

Scorpion venom business.. Income in crores

ఇంత డిమాండ్ ఉన్న తేళ్లను పెంచడం కూడా పెద్ద రిస్క్ అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒక్కొక్క తేలు నుంచి రోజుకు రెండు మిల్లీ లీటర్ల విషం ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అయిన విషాన్ని తేలు కొండి నుంచి ట్వీజర్స్ తో పిండి బయటకు తీస్తున్నారు. ఇలా తేలు నుంచి విషాన్ని తీసేటప్పుడు తేలుకు ఎటువంటి హాని జరగకుండా సరికొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. వీడియోలో తేళ్లను కుప్పలు కుప్పలుగా చూస్తుంటే ఒళ్ళు గగ్గుర్పొడుస్తుంది. విషపూరితమైన తేళ్ళను ఎవరికి ఎటువంటి హాని జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తేళ్లఫారం పెంచుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎక్కడిదో తెలియదు. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కైపోతున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది