
Today Gold Price : ఈ రోజు బంగారం ధరల్లో మార్పు లేదు.. కానీ వెండి ఏకంగా రూ. 3 వేలు పెరిగింది..!
Today Gold Price : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. కేవలం ఒక్కరోజే కిలో వెండి ధర రూ.3,000 మేర పెరిగి రూ. 1,17,000కు చేరుకోవడం మార్కెట్‌లో ఆశ్చర్యాన్ని కలిగించింది. గత కొంతకాలంగా బంగారానికి ప్రత్యామ్నాయంగా వెండిపై ప్రజల ఆసక్తి పెరుగుతుండగా, తాజా ధరల పెరుగుదల దీనిని మరింత బలపరుస్తోంది. ఇది ఇటీవల కాలంలో వెండి ధరలో చోటుచేసుకున్న అతిపెద్ద పెరుగుదలగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు .
Today Gold Price : ఈ రోజు బంగారం ధరల్లో మార్పు లేదు.. కానీ వెండి ఏకంగా రూ. 3 వేలు పెరిగింది..!
ఇక బంగారం విషయానికి వస్తే.. మూడు రోజులుగా పెరుగుతూ వస్తుండగా.. ఈ రోజు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ( పుత్తడి ) 10 గ్రాముల ధర రూ. 99,600 వద్ద స్థిరంగా ఉంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,300గా కొనసాగుతోంది .
ఆభరణాల కొనుగోలు దారులకు ఇది కొంత ఊరట కలిగించినా, వెండి ధర పెరుగుదల వినియోగదారులకు భారం అవుతోంది. పెరుగుతున్న అంతర్జాతీయ వెండి డిమాండ్, రూపాయి మారకపు విలువలో మార్పులు, మార్కెట్‌లో ముడిసరుకుల కొరత వంటి అంశాలు ఈ ధరల పెరుగుదలకు కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరికొన్ని రోజులు వెండి కొనుగోళ్లపై ప్రజలు కాస్త వెనుకంజ వేయవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.