#image_title
Drum Stick : ఈ రోజుల్లో చాలా మంది బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే ఏ బిజినెస్ బాగా క్లిక్ అవుతుంది అనే విషయంలో మాత్రం కాస్త ఆందోళనకి గురవుతున్నారు. అయితే మునగ పంట ద్వారా డబ్బులు సంపాదించొచ్చు. మునగ చెట్లను కూడా మెడిషనల్ ప్లాంటుగానే పేర్కొంటాం. దీన్ని సాగు చేస్తే తక్కు ఖర్చుతోనే ఆకర్షణీయ రాబడి పొందొచ్చు. మునగను విదేశాలకు ఎగుమతి కూడా చేయొచ్చు. ఈ పంట సాగు చేయడానికి వారం వారం నీళ్లు కట్టాల్సిన పని లేదు. ఇంకా మందులు కూడా ఎక్కువగా కొట్టాల్సిన అవసరం లేదు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం వకీల్ ఫారం గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ. గత కొంత కాలంగా 10 ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకున్నారు.
Drum Stick : పెట్టుబడి తక్కువ..లాభాలు నిండుగా..!
అందులో వరి, ఆపిల్ బేర్, మునగ, కూరగాయల వంటివి సాగు చేస్తున్నారు. అర ఎకరంలో మునగ సాగు చేస్తున్నారు. మునగకు చాలా మంచి డిమాండ్ ఉందని వెంకటరమణ చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో మునగ కిలో 80 రూపాయలు పలుకుతుంది. మార్చి చివరి వరకు మునగ దిగుబడి పెరుగుతుంది. మునగ తక్కువ ఖర్చుతో కూడిన పంట. ఒక్కసారి విత్తిన తర్వాత నాలుగేళ్ల వరకు మళ్లీ పొలం దున్నాల్సిన పనిలేదు. మునగ పంటకు వర్షం వల్ల కూడా నష్టం ఉండదు. ఎక్కువ కురిసినా.. తక్కువ పడినా.. ఇబ్బందేం లేదు. ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పెరిగే చెట్టు. అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. సంవత్సరానికి రెండుసార్లు కాపు తీయవచ్చు. ఏడాది పొడవునా ఒక్కో మొక్క నుంచి దాదాపు 200-400 కాయలు (40-50 కిలోలు) అందుబాటులో ఉంటాయి
గాలి, వాన వచ్చినప్పుడు మాత్రమే కాస్త ఇబ్బంది తప్ప మిగతా సందర్భాలలో ఎలాంటి సమస్య ఉండదు. నేను గత కొంతకాలంగా మునగ సాగు చేస్తున్నాను. ఏ రోజు నష్టం జరగలేదని సదరు రైతు వివరించారు. మునగ ఎకరాలకు 1,200 మొక్కలు నాటొచ్చు. దీనికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది. కేవలం మునగ ఆకు అమ్మడం ద్వారానే ఏడాదికి రూ.60 వేలు వస్తుంది. మునగ కాయల ద్వారా మరో రూ.లక్షకు పైగా డబ్బు సంపాదించొచ్చు. అంటే రూ.50 వేలు ఖర్చు పెడితే పదేళ్ల పాటు ప్రతి ఏడాది రూ.లక్షకు పైగా సంపాదించొచ్చు. మునగలో మళ్లీ అంతర పంటలు కూడా పండించొచ్చు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.