Drum Stick : పెట్టుబ‌డి త‌క్కువ‌..లాభాలు నిండుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Drum Stick : పెట్టుబ‌డి త‌క్కువ‌..లాభాలు నిండుగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :4 January 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Drum Stick : పెట్టుబ‌డి త‌క్కువ‌..లాభాలు నిండుగా..!

Drum Stick :  ఈ రోజుల్లో చాలా మంది బిజినెస్‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే ఏ బిజినెస్ బాగా క్లిక్ అవుతుంది అనే విష‌యంలో మాత్రం కాస్త ఆందోళ‌న‌కి గుర‌వుతున్నారు. అయితే మునగ పంట ద్వారా డబ్బులు సంపాదించొచ్చు. మునగ చెట్లను కూడా మెడిషనల్ ప్లాంటుగానే పేర్కొంటాం. దీన్ని సాగు చేస్తే తక్కు ఖర్చుతోనే ఆకర్షణీయ రాబడి పొందొచ్చు. మునగను విదేశాలకు ఎగుమతి కూడా చేయొచ్చు. ఈ పంట సాగు చేయడానికి వారం వారం నీళ్లు కట్టాల్సిన పని లేదు. ఇంకా మందులు కూడా ఎక్కువగా కొట్టాల్సిన అవసరం లేదు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం వకీల్ ఫారం గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ. గత కొంత కాలంగా 10 ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకున్నారు.

Drum Stick పెట్టుబ‌డి త‌క్కువ‌లాభాలు నిండుగా

Drum Stick : పెట్టుబ‌డి త‌క్కువ‌..లాభాలు నిండుగా..!

Drum Stick మంచి లాభం..

అందులో వరి, ఆపిల్ బేర్, మునగ, కూరగాయల వంటివి సాగు చేస్తున్నారు. అర ఎకరంలో మునగ సాగు చేస్తున్నారు. మునగకు చాలా మంచి డిమాండ్ ఉందని వెంకటరమణ చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో మునగ కిలో 80 రూపాయలు పలుకుతుంది. మార్చి చివరి వరకు మునగ దిగుబడి పెరుగుతుంది. మునగ తక్కువ ఖర్చుతో కూడిన పంట. ఒక్కసారి విత్తిన తర్వాత నాలుగేళ్ల వరకు మళ్లీ పొలం దున్నాల్సిన పనిలేదు. మునగ పంటకు వర్షం వల్ల కూడా నష్టం ఉండదు. ఎక్కువ కురిసినా.. తక్కువ పడినా.. ఇబ్బందేం లేదు. ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పెరిగే చెట్టు. అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. సంవత్సరానికి రెండుసార్లు కాపు తీయవచ్చు. ఏడాది పొడవునా ఒక్కో మొక్క నుంచి దాదాపు 200-400 కాయలు (40-50 కిలోలు) అందుబాటులో ఉంటాయి

గాలి, వాన వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే కాస్త ఇబ్బంది త‌ప్ప మిగ‌తా సంద‌ర్భాల‌లో ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. నేను గత కొంతకాలంగా మునగ సాగు చేస్తున్నాను. ఏ రోజు నష్టం జరగలేదని సదరు రైతు వివరించారు. మున‌గ ఎకరాలకు 1,200 మొక్కలు నాటొచ్చు. దీనికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది. కేవలం మునగ ఆకు అమ్మడం ద్వారానే ఏడాదికి రూ.60 వేలు వస్తుంది. మునగ కాయల ద్వారా మరో రూ.లక్షకు పైగా డబ్బు సంపాదించొచ్చు. అంటే రూ.50 వేలు ఖర్చు పెడితే పదేళ్ల పాటు ప్రతి ఏడాది రూ.లక్షకు పైగా సంపాదించొచ్చు. మునగలో మళ్లీ అంతర పంటలు కూడా పండించొచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది