Today Gold Price : ఈరోజు కూడా భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
ప్రధానాంశాలు:
Today Gold Price : ఈరోజు కూడా భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
Today Gold Price : ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు ఏకంగా రూ. 2,120 పెరిగింది. ఈ పెరుగుదలతో బంగారం ధర చాలా రోజుల తర్వాత మళ్లీ లక్ష రూపాయల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,400కు చేరుకుంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 1,950 పెరిగి 10 గ్రాములకు రూ. 92,950గా నమోదైంది.

Today Gold Price : ఈరోజు కూడా భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
Today Gold Price ఈరోజు రూ. 2 వేలు పెరిగిన తులం బంగారం ధర
వెండి ధరలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. కేజీ వెండి ధర ఒక్కరోజులోనే రూ. 1,100 పెరిగి తొలిసారి రూ. 1,20,000 మార్క్‌ను తాకింది. వెండి ధరల్లో ఈ స్థాయిలో పెరుగుదల చాలా అరుదైనది. బంగారం, వెండి ధరలు పెరగడం వల్ల జువెల్లరీ కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది తీవ్రమైన ఆర్థిక భారం అవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారుగా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం, డాలర్ విలువ మార్పులు, ముడి చమురు ధరలు, ఆర్థిక అస్థిరత వంటి పరిణామాలు ఈ ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, పెట్టుబడి దృష్టితో కొనుగోలు చేసే వారు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.