Today Gold Price : భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనేవారికే ఇదే మంచి ఛాన్స్..!
ప్రధానాంశాలు:
Today Gold Price : భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనేవారికే ఇదే మంచి ఛాన్స్..!
Today Gold Price : గత పది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు షాక్ లో ఉన్నారు. పుత్తడి రేటు లక్ష రూపాయల మార్క్‌ను దాటడంతో, బంగారం కొనాలనుకునే వారిలో ఆందోళన ఉండేది. అయితే తాజాగా బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ తగ్గుదల చోటుచేసుకోవడంతో పసిడి ప్రియులకు ఊరట లభించింది. ఈ మార్పు వలన బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

Today Gold Price : భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనేవారికే ఇదే మంచి ఛాన్స్..!
Today Gold Price : పడిపోయిన బంగారం ధరలు… ఈరోజు తులం ఎంత ఉందంటే !!
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర సోమవారం 10 గ్రాములకు రూ. 1,02,650గా ఉండగా, మంగళవారం నాటికి రూ.1,120 తగ్గి రూ. 1,01,530కు చేరుకుంది. అదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 1,09,165 నుండి రూ.1,09,340కి పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర నగరాల్లో కూడా బంగారం ధరలు అదే స్థాయిలో నమోదయ్యాయి. ఈ ధరల తగ్గుదలకు ప్రధానంగా ప్రపంచ మార్కెట్లో ఉద్రిక్తతలు తగ్గడం, పెట్టుబడిదారుల ఆందోళనలు తగ్గడమే కారణంగా చెబుతున్నారు.
ఈ ధరల మార్పులకు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్‌తో రూపాయి మారకపు విలువ, డిమాండ్ వృద్ధి వంటి అంశాలు ప్రధాన కారణాలుగా నిలుస్తాయి. ఈ నేపధ్యంలో బంగారం కొనుగోలు చేసే ముందు ధరలపై సరైన సమాచారం సేకరించుకోవడం అవసరం.