Today Gold Price : ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి..? సామాన్యులు కొనే పరిస్థితి ఉందా..?
ప్రధానాంశాలు:
Today Gold Price : ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి..? సామాన్యులు కొనే పరిస్థితి ఉందా..?
Today Gold Price : బంగారం ధర మార్కెట్లో తగ్గేదెలేదని అంటున్నది. రోజు..రోజుకు ధర భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూలేని విధంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బంగారం అంటేనే బాబోయ్ అనే పరిస్థితి ఎదురవుతున్నది. నిన్న గురువారం మరోసారి పెరిగి ఆల్‌టైమ్ హైకి చేరుకుంది…

Today Gold Price : ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి..? సామాన్యులు కొనే పరిస్థితి ఉందా..?
ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ నేపథ్యంలో ఢిల్లీలో రూ.70 పెరిగి తులం ధర రూ.98,170కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. 99.5 ప్యూరిటీ గోల్డ్ ధర సైతం రూ.70 పెరిగి.. తులానికి రూ.97,720కి ఎగిసింది. ఇక ఈరోజు ఏప్రిల్ 18 విషయానికి వస్తే ..ఉదయం బంగారం ధర చూస్తే, హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 9,732, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,921 మరియు 18 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 7,299 గా ఉంది.
ఈ ధర ఈరోజుకు ఫిక్స్ కాదు గంట గంటకు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు వస్తుంటాయి. బంగారం కొనే ముందు ఆ సమయంలో మార్కెట్ లో ఎంత ఉందొ అది పరిగణలోకి వస్తుంది.ఇటు వెండి ధర తగ్గుతుంది. లక్ష పైన ఉన్న వెండి రూ.1,400 తగ్గి.. కిలోకు రూ.98వేలకు చేరుకుంది.