Today Gold Price : బరువెక్కిన బంగారం.. వేసుకోవడం కష్టమే.. 2000 నుంచి 2025 వర‌కు ఎంత పెరిగిందంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Price : బరువెక్కిన బంగారం.. వేసుకోవడం కష్టమే.. 2000 నుంచి 2025 వర‌కు ఎంత పెరిగిందంటే..?

 Authored By ramu | The Telugu News | Updated on :23 April 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Today Gold Price : బరువెక్కిన బంగారం.. వేసుకోవడం కష్టమే..2000 నుంచి 2025 వర‌కు ఎంత పెరిగిందంటే..?

Today Gold Price : ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితి, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం బంగారం ధరలపై తీవ్రంగా పడింది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటం వల్ల బంగారం డిమాండ్ పెరిగింది. పసిడి రేట్లు రాకెట్ వేగంతో ఎగబాకుతూ, దేశీయంగా 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు లక్ష రూపాయలు దాటేసింది. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధర రూ.10,000 పైగా పలుకుతోంది. దీనివల్ల బంగారం కొనుగోలు సామాన్యులకు మరింత కష్టమవుతోంది.

Today Gold Price బరువెక్కిన బంగారం వేసుకోవడం కష్టమే 2000 నుంచి 2025 వర‌కు ఎంత పెరిగిందంటే

Today Gold Price : బరువెక్కిన బంగారం.. వేసుకోవడం కష్టమే.. 2000 నుంచి 2025 వర‌కు ఎంత పెరిగిందంటే..?

బంగారాన్ని సాధారణంగా సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ సంపదను రక్షించుకోవడానికి బంగారంలో పెట్టుబడి పెడతారు. అంతేకాక, రాజకీయ అస్థిరత, యుద్ధ పరిస్థితులు నెలకొన్నపుడు పెట్టుబడిదారులు బంగారంను విశ్వసనీయ ఆస్తిగా భావించి దానికి మొగ్గు చూపుతారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు మరింతగా పెరుగుతుంటాయి. ప్రస్తుతం కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నందున బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరాయి.

భారతదేశంలో బంగారం ప్రధానంగా దిగుమతి ద్వారా అందించబడుతుంది. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే పడిపోతే, బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధర పెరిగిపోతుంది. అలాగే పండుగలు, వివాహాల సీజన్లో బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది. జ్యుయెల్లర్స్‌, రిటైలర్స్‌ నుంచి డిమాండ్ ఉండడంతో రిటైల్ మార్కెట్‌లో కూడా ధరలు తగ్గే అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులను చూస్తే బంగారం ధరలు మరికొంతకాలం ఎగసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

Today Gold Price : ఇక 2000 సంవత్సరం నుంచి 2025 వరకు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇండియాలో ఎంతుందో చూస్తే..

1) 2000 సంవత్సరంలో 4,400 రూపాయలు

2) 2001 సంవత్సరంలో 4,300 రూపాయలు

3) 2002 సంవత్సరంలో 4,990 రూపాయలు

4) 2003 సంవత్సరంలో 5,600 రూపాయలు

5) 2004 సంవత్సరంలో 6,307 రూపాయలు

6) 2005 సంవత్సరంలో 7,638 రూపాయలు

7)2006 సంవత్సరంలో 9,265 రూపాయలు

8)2007 సంవత్సరంలో 10,598 రూపాయలు

9) 2008 సంవత్సరంలో 13,630 రూపాయలు

10) 2009 సంవత్సరంలో 16,686 రూపాయలు

11) 2010 సంవత్సరంలో 20,728 రూపాయలు

12) 2011 సంవత్సరంలో 27,329 రూపాయలు

13) 2012 సంవత్సరంలో 30,859 రూపాయలు

14) 2013 సంవత్సరంలో 28,422 రూపాయలు

15) 2014 సంవత్సరంలో 26,703 రూపాయలు

16) 2015 సంవత్సరంలో 24,931 రూపాయలు

17) 2016 సంవత్సరంలో 27,445 రూపాయలు

18) 2017 సంవత్సరంలో 29,156 రూపాయలు

19) 2018 సంవత్సరంలో 31,391 రూపాయలు

20) 2019 సంవత్సరంలో 39,108 రూపాయలు

21) 2020 సంవత్సరంలో 50,151 రూపాయలు

22) 2021 సంవత్సరంలో 4 8,099 రూపాయలు

23) 2022 సంవత్సరంలో 55,017 రూపాయలు

24) 2023 సంవత్సరంలో 63,203 రూపాయలు

25) 2024 సంవత్సరంలో 78,245 రూపాయలు

26) 2025(ఏప్రిల్22) 1,02,170 రూపాయలు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది