Today Gold Price : బరువెక్కిన బంగారం.. వేసుకోవడం కష్టమే.. 2000 నుంచి 2025 వరకు ఎంత పెరిగిందంటే..?
Today Gold Price : ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితి, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం బంగారం ధరలపై తీవ్రంగా పడింది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటం వల్ల బంగారం డిమాండ్ పెరిగింది. పసిడి రేట్లు రాకెట్ వేగంతో ఎగబాకుతూ, దేశీయంగా 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు లక్ష రూపాయలు దాటేసింది. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధర రూ.10,000 పైగా పలుకుతోంది. దీనివల్ల బంగారం కొనుగోలు సామాన్యులకు మరింత కష్టమవుతోంది.
Today Gold Price : బరువెక్కిన బంగారం.. వేసుకోవడం కష్టమే.. 2000 నుంచి 2025 వరకు ఎంత పెరిగిందంటే..?
బంగారాన్ని సాధారణంగా సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ సంపదను రక్షించుకోవడానికి బంగారంలో పెట్టుబడి పెడతారు. అంతేకాక, రాజకీయ అస్థిరత, యుద్ధ పరిస్థితులు నెలకొన్నపుడు పెట్టుబడిదారులు బంగారంను విశ్వసనీయ ఆస్తిగా భావించి దానికి మొగ్గు చూపుతారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు మరింతగా పెరుగుతుంటాయి. ప్రస్తుతం కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నందున బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరాయి.
భారతదేశంలో బంగారం ప్రధానంగా దిగుమతి ద్వారా అందించబడుతుంది. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే పడిపోతే, బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధర పెరిగిపోతుంది. అలాగే పండుగలు, వివాహాల సీజన్లో బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది. జ్యుయెల్లర్స్, రిటైలర్స్ నుంచి డిమాండ్ ఉండడంతో రిటైల్ మార్కెట్‌లో కూడా ధరలు తగ్గే అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులను చూస్తే బంగారం ధరలు మరికొంతకాలం ఎగసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
1) 2000 సంవత్సరంలో 4,400 రూపాయలు
2) 2001 సంవత్సరంలో 4,300 రూపాయలు
3) 2002 సంవత్సరంలో 4,990 రూపాయలు
4) 2003 సంవత్సరంలో 5,600 రూపాయలు
5) 2004 సంవత్సరంలో 6,307 రూపాయలు
6) 2005 సంవత్సరంలో 7,638 రూపాయలు
7)2006 సంవత్సరంలో 9,265 రూపాయలు
8)2007 సంవత్సరంలో 10,598 రూపాయలు
9) 2008 సంవత్సరంలో 13,630 రూపాయలు
10) 2009 సంవత్సరంలో 16,686 రూపాయలు
11) 2010 సంవత్సరంలో 20,728 రూపాయలు
12) 2011 సంవత్సరంలో 27,329 రూపాయలు
13) 2012 సంవత్సరంలో 30,859 రూపాయలు
14) 2013 సంవత్సరంలో 28,422 రూపాయలు
15) 2014 సంవత్సరంలో 26,703 రూపాయలు
16) 2015 సంవత్సరంలో 24,931 రూపాయలు
17) 2016 సంవత్సరంలో 27,445 రూపాయలు
18) 2017 సంవత్సరంలో 29,156 రూపాయలు
19) 2018 సంవత్సరంలో 31,391 రూపాయలు
20) 2019 సంవత్సరంలో 39,108 రూపాయలు
21) 2020 సంవత్సరంలో 50,151 రూపాయలు
22) 2021 సంవత్సరంలో 4 8,099 రూపాయలు
23) 2022 సంవత్సరంలో 55,017 రూపాయలు
24) 2023 సంవత్సరంలో 63,203 రూపాయలు
25) 2024 సంవత్సరంలో 78,245 రూపాయలు
26) 2025(ఏప్రిల్22) 1,02,170 రూపాయలు
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.