Today Gold Price : నిన్న తగ్గినట్లే తగ్గి…ఈరోజు మరింత పెరిగిన బంగారం ధర..!
ప్రధానాంశాలు:
Today Gold Price : నిన్న తగ్గినట్లే తగ్గి...ఈరోజు మరింత పెరిగిన బంగారం ధర..!
Today Gold Price : పసిడి ధరలు మళ్లీ పరుగులు పెట్టాయి. నిన్న తగ్గినట్లు కనిపించిన బంగారం ధరలు ఈరోజు మాత్రం పెరుగుదలతో షాక్ ఇచ్చాయి. మార్కెట్లో మళ్లీ పెరిగిన ధరలతో వినియోగదారులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఉత్సవాలు జరుపుకునే సీజన్‌లో పసిడి ధరల పెరుగుదల ప్రజలను ఆలోచనలో పడేస్తోంది.

Today Gold Price : నిన్న తగ్గినట్లే తగ్గి…ఈరోజు మరింత పెరిగిన బంగారం ధర..!
Today Gold Price : పసిడి మళ్లీ పరుగులు.. ఈరోజు ఎంత ఉందంటే
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.490 పెరిగి రూ.98,130కి చేరింది. ఇది బంగారం ధరల్లో భారీ మార్పుగా చెప్పుకోవచ్చు. ఇక 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.450 పెరిగి ప్రస్తుతం రూ.89,950గా ఉంది. ఈ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఒకేలా కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.1,11,000గా స్థిరంగా ఉంది. వెండి కొనుగోలు చేసే వారికి ఇది ఊరట కలిగించే విషయం. అయితే బంగారంపై పెరుగుతున్న ధరలు మధ్య తరగతి ప్రజలకు తీవ్ర భారం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పలు కారణాలతో బంగారం ధరలు మారుతూ వస్తున్నాయి. డాలర్ మారకం విలువ, గ్లోబల్ లిక్విడిటీ పరిస్థితులు, ద్రవ్యోల్బణ అంచనాలు మొదలైనవి బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనుగోలుపై ముందు జాగ్రత్తగా ఆలోచించాలని సూచిస్తున్నారు.