Today Gold prices : వామ్మో .. బంగారం ధర ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా..?
ప్రధానాంశాలు:
Today Gold prices : వామ్మో .. బంగారం ధర ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా..?
Today Gold prices : గత వారం బంగారం ధరలు తగ్గగా..ఈ వారం మాత్రం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మూడు రోజులుగా మార్కెట్ లో బంగారం , వెండి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు బంగారం ధర చూస్తే… హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ. 880 పెరిగి రూ. 99,280కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు రూ. 800 పెరిగి రూ. 91,000 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ. 1,18,900గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అయితే బంగారం ధరలు రోజుకో మలుపు తిరుగుతుంటాయి. ఇవి పెరగడం, తగ్గడం అనేక ఆర్థిక, భౌగోళిక, అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా అమెరికా డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం డిమాండ్, స్టాక్ మార్కెట్ స్థితిగతులు, దేశీయ ద్రవ్యోల్బణం (inflation), కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ఇవన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఫలితంగా ధరలు పెరుగుతాయి.

Today Gold prices : వామ్మో .. బంగారం ధర ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా..?
Today Gold prices : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు
ఇక దేశీయంగా చూస్తే.. భారతదేశంలో రూపాయి విలువ, దిగుమతి సుంకాలు , ఉత్పత్తుల ధరలు వంటి అంశాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. యుక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంతర్జాతీయ సంఘటనలు లేదా అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినా తగ్గినా వాటి ప్రభావం బంగారం మీద చూపిస్తుంది. వెండి ధరలు కూడా ఈ పోలికలోనే మారుతుంటాయి, అయితే బంగారంతో పోలిస్తే వెండి కొద్దిగా వ్యాపార వాడకానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది.
భారతీయుల బంగారంపై మక్కువ ఒక ప్రత్యేకమైన అంశం. ఇది ఆర్థిక పెట్టుబడి కాదు, సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. మహిళలు ధరిచే ఆభరణాలు కేవలం అలంకారానికి కాదు, భవిష్యత్తు భద్రతకు సంకేతంగా భావిస్తారు. పైగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సౌకర్యాల లేమి ఉన్నప్పుడు బంగారం ఒక నిక్షేప రూపంగా ఉపయోగపడుతుంది. అందుకే బంగారం ధరలు ఎంత పెరిగినా, కొనుగోలు చేయాలన్న ఆసక్తి భారతీయుల్లో ఎప్పటికీ తగ్గదు.