Today Gold Rate : మళ్లీ లక్ష దాటినా తులం బంగారం.. ఇంకా ఏం కొంటారు..!
ప్రధానాంశాలు:
Today Gold Rate : మళ్లీ లక్ష దాటినా తులం బంగారం.. ఇంకా ఏం కొంటారు..!
Today Gold Rate : జూన్ 3 మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ ఉన్న బంగారం ధరలు ఒక్కరోజులోనే భారీ ఎత్తున పెరిగాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.98,610గా ఉండగా, మంగళవారం నాటికి రూ.1,620 పెరిగి రూ.1,00,230కు చేరుకుంది. ఇది పసిడి ప్రియులకు గట్టి షాక్ అని చెప్పాలి. అంతేకాకుండా వెండి ధరలు కూడా ఈ పెరుగుదల లో భాగస్వామ్యమయ్యాయి. కిలో వెండి ధర సోమవారం రూ.99,998 ఉండగా, మంగళవారం నాటికి రూ.2,599 పెరిగి రూ.1,02,597కు చేరింది.

Today Gold Rate : మళ్లీ లక్ష దాటినా తులం బంగారం.. ఇంకా ఏం కొంటారు..!
Today Gold Rate : బంగారం మళ్లీ లక్ష దాటింది.. ధరల పెరుగుదలతో కొనుగోలు దారులు ఉక్కిరిబిక్కిరి
ప్రస్తుతం దేశంలో ప్రముఖ నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరులో బంగారం ధర రూ.1,00,230కు చేరింది. వెండి ధరలు కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రేట్లను చూస్తుంటే బంగారం కొనాలంటే సామాన్య ప్రజలకు అది ఎంతో భారంగా మారింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగల కోసం బంగారం కొనుగోలు చేసే వారు ఇప్పుడు తర్జన భర్జనలలో పడుతున్నారు.
ఈ ధరల పెరుగుదలకు కారణాల గురించి పరిశీలిస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్-రూ. మారకపు విలువ, అలాగే పెట్టుబడిదారుల నుండి బంగారంపై పెరుగుతున్న డిమాండ్ ముఖ్యమైనవి. చైనా, అమెరికా లాంటి దేశాల్లో పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులు పెంచుతుండటంతో ధరలు స్వల్పకాలంలోనే లక్ష మార్క్‌ను దాటాయి. ప్రజలు ఇప్పుడైనా కొనుగోళ్లలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున వేచి చూసి కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.