Today Gold Rate 18 January 2026 : బంగారం కొనేవారికి ఉరట..ఈరోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతంటే?
ప్రధానాంశాలు:
Today Gold Rate 18 January 2026 : బంగారం కొనేవారికి ఉరట..ఈరోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతంటే?
Today Gold Rate 18 January 2026 : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ రావడం తెలిసిందే. ముఖ్యంగా గత వారం రోజుల్లోనే బంగారం ధర ఏకంగా రూ.3 వేలకుపైగా పెరగడంతో సాధారణ కొనుగోలుదారులు పెళ్లిళ్ల కోసం ఆభరణాలు కొనాలనుకునేవారు ఆందోళనకు గురయ్యారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు బంగారం మార్కెట్‌ను హాట్‌టాపిక్‌గా మార్చాయి. పెట్టుబడిదారులు ఒక వైపు లాభాలపై దృష్టి పెడుతుంటే వినియోగదారులు మాత్రం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం బంగారం ధరలు పెరుగుదలకు బ్రేక్ పడటంతో కొంతమేర ఊరట లభించింది.
Today Gold Rate 18 January 2026 : బంగారం ధరలకు బ్రేక్..ఆదివారం కొనుగోలుదారులకు కాస్త ఊరట
Today Gold Rate 18 January 2026 : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?
ఆదివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,780 వద్ద నిలిచింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,800గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగడం గమనార్హం. చెన్నై మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,870గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,32,800 వద్ద స్థిరంగా ఉంది. బెంగళూరులోనూ హైదరాబాద్ తరహాలోనే 24 క్యారెట్ల బంగారం రూ.1,43,780కు, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,800కు లభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,930గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,950 వద్ద స్థిరపడింది. మొత్తం మీద అన్ని ప్రధాన నగరాల్లో ఆదివారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.
Today Gold Rate 18 January 2026 : వెండి ధరలు..మూడు లక్షల మార్క్ వద్ద సందడి
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. వెండి ధరలు ఇప్పటికే మూడు లక్షల మార్క్‌ను దాటాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.3,10,000 వద్ద ఉంది. ఇదే ధర విజయవాడ, విశాఖపట్నంలోనూ కొనసాగుతోంది. చెన్నైలో కూడా కేజీ వెండి ధర రూ.3,10,000గా ఉండటం గమనార్హం. అయితే ఢిల్లీలో మాత్రం వెండి ధర కొంత తక్కువగా ఉంది. అక్కడ కేజీ వెండి రూ.2,95,000 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు ఈ స్థాయిలో ఉండటంతో చిన్న పెట్టుబడిదారులు కూడా ఆలోచనలో పడ్డారు. అంతేకాక.. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉండటంతో మార్కెట్‌లో కొంత శాంతి నెలకొంది. రానున్న రోజుల్లో ధరలు తగ్గుతాయా లేదా మళ్లీ పెరుగుతాయా అన్నది అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.