Today Gold Rate : బంగారం పరుగులు కొనుగోలు దారుల దిగులు.. మళ్లీ పెరిగిన బంగారం ధర..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Rate : బంగారం పరుగులు కొనుగోలు దారుల దిగులు.. మళ్లీ పెరిగిన బంగారం ధర..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Today Gold Rate : బంగారం పరుగులు కొనుగోలు దారుల దిగులు.. మళ్లీ పెరిగిన బంగారం ధర..!

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు బంగారం ధరలు పెరగడం ఒక పెద్ద షాక్‌గా మారింది. వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరగడంతో హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేట్లు మళ్లీ గరిష్ఠ స్థాయికి చేరాయి. 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.200 పెరిగి 10 గ్రాములకు రూ.90,800కు చేరింది. దీంతో తులం ధర మరింత భారంగా మారింది. పెళ్లిళ్ల సీజన్‌కు ముందు ఇలా ధరలు పెరగడం వల్ల వినియోగదారులు కొంత వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తోంది.

Today Gold Rate బంగారం పరుగులు కొనుగోలు దారుల దిగులు మళ్లీ పెరిగిన బంగారం ధర

Today Gold Rate : బంగారం పరుగులు కొనుగోలు దారుల దిగులు.. మళ్లీ పెరిగిన బంగారం ధర..!

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ షాక్

అంతేకాకుండా 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరుగుతూ రూ.99,060 వద్దకు చేరుకుంది. సాధారణంగా 24 క్యారెట్ల బంగారం ఎక్కువ స్వచ్ఛతతో ఉండటంతో పెట్టుబడిదారులు దీనిపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇదే సమయంలో వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,11,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది సాధారణ ప్రజలకు భారం కలిగించే స్థాయికి చేరిందని ఆభరణ వ్యాపారులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే దేశీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండగా, ఆశ్చర్యకరంగా అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు కొద్దిగా దిగివచ్చాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ ధనవినియోగ విధానాల మార్పు, డాలర్ బలపడడం వంటి కారణాలతో ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గాయి. అయితే దేశీయంగా డిమాండ్ పెరగడం, రూపాయి బలహీనత వంటి అంశాలు బంగారం ధరలను మళ్లీ పైకి తీసుకెళుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది