Home » Business » Union Budget 2025 Middle Class Gains And Upi Linked Credit Cards
Business

Union Budget 2025 : మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ల‌కి నిర్మ‌ల‌మ్మ అందించిన శుభ‌వార్త‌లు ఇవే..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: February 1, 2025 2:34 pm
Advertisement

Union Budget 2025 : బడ్జెట్ 2025 చాలా చారిత్రాత్మకమైనది అని చెప్ప‌వ‌చ్చు. ఈ ఏడాది పేదలు, యువత, మహిళలు,రైతుల కోసం 10 కీలక రంగాల్లో సంస్కరణలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ పేదల కోసం.. రూ. 30వేల పరిమితితో పట్టణ పేదలకోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  nirmala sitharaman బడ్జెట్ లో Union Budget 2025 పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ రంగానికి రూ. 1.5లక్షలకోట్ల రుణాలను అందించనుంది. 27 రంగాల్లో స్టార్టప్ లకు రుణాలకోసం ప్రత్యేక కార్యాచరణ ఆవలంభించనుంది.

Advertisement

Union Budget 2025 : మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ల‌కి నిర్మ‌ల‌మ్మ అందించిన శుభ‌వార్త‌లు ఇవే..!

Union Budget 2025 వ‌రాల జ‌ల్లు..

ఎస్సీ మహిళలకు రూ. 2కోట్ల రుణాలు.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళల కోసం టర్న్ లోన్ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం కింద తొలిసారి సొంత వ్యాపారం చేయాలనుకునేవారికోసం వచ్చే ఐదేళ్లలో రూ. 2కోట్ల వరకూ రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ ఇతర ప్రమాదకర వ్యాధుల మెడిసిన్లపై పూర్తిగా కస్టమ్స్ డ్యూటీని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Advertisement

ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రులు నెలకొల్పుతామన్నారు. పేద విద్యార్థుల కోసం ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ మిషన్ తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం కింద రాబోయే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 50 వేల పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నెలకొల్పుతామని చెప్పారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇంటర్ నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అంతేకాక మెడికల్ విద్యను అందరికీ అందించే విధంగా వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75వేల కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు నిర్మలా సీతారామన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి