Union Budget 2025 : ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం శనివారం (2025 ఫిబ్రవరి 1)న ఉదయం 11 గంటలకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman మూడవ సారి మోదీ ప్రభుత్వంలో రెండవ సారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను Union Budget 2025 ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లయ్యింది. పాత పన్ను విధానం రద్దు చేసి ఏడాదికి రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి జీరో ఇన్‌కంటాక్స్ విధానం ప్రవేశపెట్టారు.అయితే దీనిపై ఎలాంటి రియల్ ఎస్టేట్ సెక్టార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కేటాయింపులపై కూడా ఆసక్తికర ప్రకటన చేశారు.
మొత్తానికి నిర్మలమ్మ బడ్జెట్‌లో Union Budget 2025 ఈ ఏడాది ఎన్నికలకు వెళుతున్న బీహార్ రాష్ట్రంపై కనికరం చూపారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆదాయపు పన్ను కొత్త స్లాబ్‌లు రూ 4 నుండి 8 లక్షలు – 5శాతం, రూ 8 నుండి 12 లక్షలు – 10శాతం రూ 12 – 16 లక్షలు – 15శాతం,రూ 16 – 20 లక్షలు – 20శాతం,రూ 20 – 24 లక్ష – 25శాతం రూ 24 లక్షలు ప్లస్ – 30శాతం, సీనియర్ సిటిజన్‌ల కోసం TDS పరిమితిని రూ. 50,000 నుండి రూ. 1 లక్షకు పెంచినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మెడికల్ కాలేజీల్లో దేశవ్యాప్తంగా అదనంగా 10వేల సీట్లు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయని నిర్మలమ్మ ప్రకటించారు. రానున్న ఐదేళ్ల సీట్ల సంఖ్యను 75వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
2023-24 బడ్జెట్‌లో తొలగించిన ఏడు రేట్లకు అదనంగా ఏడు టారిఫ్ రేట్లను తొలగిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంతో సున్నా రేటుతో సహా ఎనిమిది టారిఫ్ రేట్లు మాత్రమే మిగిలి ఉంటాయని ఆమె చెప్పారు. ఆర్థిక సంవత్సరం 2025కు ద్రవ్య లోటు 4.8శాతం ఉండగా,ఆర్థిక సంవత్సరం 2026కు అంచనా 4.4శాతం. 120 కొత్త గమ్యస్థానాలను చేర్చి, 4 కోట్ల మంది అదనపు ప్రయాణీకులకు సేవలందించే సవరించిన ఉడాన్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు . 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 200 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు 2 Hours Ago జలజీవన్ మిషన్ పొడిగింపు జల్ జీవన్ మిషన్‌ను 2028 వరకు పొడిగించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
ఏఐ విద్యకోసం రూ.500 కోట్లు కేటాయింపులు,నైపుణ్యం కోసం 5నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు,2014 తర్వాత ప్రారంభించిన 5 ఐఐటీల్లో మరో 6500 మంది విద్యార్థుల కోసం అదనపు మౌలిక సదుపాయాలు సృష్టించడం,మాతృభాష కోసం భారతీయ భాషా పుస్తక్ పథకం ప్రారంభించబడుతుంది. బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేయబడుతుందన్నారు.ఇది తూర్పు ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలను పెంచే లక్ష్యంతో ఉంటుందని చెప్పారు.
రైతులు, మత్స్యకారులు,పాడి రైతులకు స్వల్పకాలిక రుణాలను అందించడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్‌లు (కెసిసి) కొనసాగుతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేసీసీ ద్వారా తీసుకునే రుణాలకు రుణ పరిమితి ₹ 3,000 నుండి ₹ 5,000 వరకు పెంచబడుతుందని ఆమె తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు, రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు, పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం, కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలు చేయనున్న కేంద్రం, పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం. బడ్జెట్ ప్రకటిస్తుండటంతో.. ఒక్కసారిగా లాభాల్లో పడ్డ సెన్సెక్స్.. ఇప్పుడు క్రాష్ అయ్యాయి.
Ghee : నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి…
Rythu Bharosa : రైతు భరోసా విషయంలో గత కొద్ది రోజులుగా అందరిలో అనేక అనుమానాలు ఉండగా, వాటిపై ఓ…
Palmyra Sprout : మనం రోడ్డు మీద అమ్ముతూ ఉన్న తేగలని చూస్తూనే ఉంటాం.' తేగ ' అనేది ఒక…
Union Budget 2025 : బడ్జెట్ 2025 చాలా చారిత్రాత్మకమైనది అని చెప్పవచ్చు. ఈ ఏడాది పేదలు, యువత, మహిళలు,రైతుల…
Union Budget 2025 : రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.. కేంద్ర బడ్జెట్ 2025లో కిసాన్ క్రెడిట్…
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman లోక్ సభలో దేశ బడ్జెట్…
Union Budget 2025 : బడ్జెట్‌లో కేంద్రం గుడ్ న్యూస్లు ప్రకటిస్తుంది.విద్యారంగం, విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో…
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman budget వరుసగా 8వ సారి…
This website uses cookies.