Union Budget 2025 : రైతన్నలకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..రూ.5 లక్షలకి పెంపు
ప్రధానాంశాలు:
Union Budget 2025 : రైతన్నలకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..రూ.5 లక్షలకి పెంపు
Union Budget 2025 : రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.. కేంద్ర బడ్జెట్ 2025లో కిసాన్ క్రెడిట్ లిమిట్ పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైతులకు రుణ సదుపాయాన్ని వ్యవసాయ అవసరాలకు ఆర్థిక సహాయాన్ని ప్రోత్సహించేందుకు, గ్రామీణాభివృద్ధికి కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని ప్రస్తుత రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరడంతో పాటు వారు తమ వ్యవసాయ అవసరాలను మెరుగైన మార్గంలో తీర్చుకోగలుగుతారు.
Union Budget 2025 అన్నదాత రైతులకు రెండు ముఖ్యమైన ప్రకటనలు
బడ్జెట్ 2025 ప్రారంభంలో, అన్నదాత రైతులకు రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. పథకం కింద రైతులకు అదనపు ఆర్థిక సహాయం, ఆహార ఉత్పత్తిలో బలం లభిస్తుంది. కేసీసీ ద్వారా 5 లక్షల రూపాయల వరకు సులభంగా రుణం తీసుకోగలుగుతారు, ఇది వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను స్వీకరించడానికి, దేశంలో 7.75 కోట్ల మంది కిసాన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు.
పంట ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. గత 10 ఏళ్లలో భారతదేశ వృద్ధి రేటు ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే వేగంగా ఉందని నొక్కి చెప్పారు. పేదలు, యువత, రైతులు, మహిళలు, ఆరోగ్యం, మేక్ ఇన్ ఇండియా, ఉపాధి, ఆవిష్కరణల వంటి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు.రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం 1988లో కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీని ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా రైతులకు చౌక వడ్డీ రేట్లకు రుణాలు అందుబాటులోకి వస్తాయి.