Black Magic : చేతబడి నిజమా..? అబద్దమా..? చేతబడి గురించి ఎవ్వరూ చెప్పని నిజాలు…!
ప్రధానాంశాలు:
Black Magic : చేతబడి నిజమా..? అబద్దమా..? చేతబడి గురించి ఎవ్వరూ చెప్పని నిజాలు...!
Black Magic : చేతబడి అనే మాట పల్లెటూర్లలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. అనారోగ్యం పాలైన ఇంట్లో ఒకరు తర్వాత ఒకరు చనిపోతున్న.. వ్యాపారంలో వరసగా నష్టాలు వస్తున్న.. మాపైన ఎవరో చేతబడి చేశారు అనే భావన వారిలో సహజంగానే కలుగుతుంది. మరి చేతబడి నిజంగా ఉందా అంటే దీనికి రకరకాల సమాధానాలు వస్తాయి. ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న శక్తి మనందరినీ ముందుకు నడిపిస్తుంది. ఆ అనంత శక్తిని కొందరు దేవుడు అంటే మరికొందరు దయ్యం అంటారు. ఒకటి ఒక వ్యక్తిని నాశనం చేయడానికి మరొకటి తనని వశపరచుకోవడానికి దీనినే వశీకరణం అంటారు. మన పల్లెటూరు భాషలో అయితే మందు పెట్టడం అని పిలుస్తారు. చేతబడి అనేది ఎవరి మీద పడితే వారి మీద ప్రయోగించడానికి వీలుపడదు.. దానికి కొన్ని కఠిన నియమ నిబంధనలు ఉన్నాయి. చేతబడి ఎవరిమీదైతే చేయించాలనుకుంటున్నామో వారు దగ్గర బంధువులు లేదా ప్రాణ స్నేహితులు అయి ఉండాలి. ఇది మొదటి నిబంధన.. చేతబడి చేసే వ్యక్తికి మరియు చేయబడే వ్యక్తి ఒకే ఊరిలో ఉండాలి. ఇద్దరి మధ్య నదులు కాలువలు, వాగులు అడ్డంగా ఉండకూడదు.
ఇలా ఉంటే ఆ నీటి ప్రవాహ శక్తి ఈ నెగిటివ్ ఎనర్జీని కట్టడం చేస్తుంది. అలానే చేతబడి అనేది చంద్రుడు కనిపించే రోజుల్లో కాకుండా చంద్రుడు క్షీణిస్తున్న రోజుల్లోనే చేయాలి. చంద్రుడి నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మరియు రేడియేషన్ ఈ నెగిటివ్ ఎనర్జీ పైన ప్రభావం చూపిస్తుందట. అందుకే క్షుద్ర పూజలు ఎక్కువగా అమావాస్య రోజుల్లో చేస్తుంటారు. అమావాస్యకు ఆదివారం కూడా కలిసి వస్తే అది ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుందట. ముందుగా చేతబడిన ఏ వ్యక్తి మీద అయితే ప్రయోగించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క జుట్టు, వేసుకున్న బట్టలు అతని కాలి కింద మట్టిని సేకరించి తీసుకొస్తారు. వారిపై ఎలాంటి ప్రతికూల శక్తి ప్రభావం చూపలేదు. ప్రతిదానికి నెగటివ్ గా ఆలోచిస్తూ ప్రతి చిన్న దానికి భయపడే వారి చాలా బలహీనంగా ఉంటుంది. ఇలాంటి వారి పైన నుండి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ వారి రక్షణ వలయాన్ని చేదించుకొని ప్రతికూల ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది. జుట్టు వెంట్రుకల్లో జీవశక్తి ఉంటుంది. తాంత్రికను వీటితో ఒక బొమ్మను తయారుచేసి చేతబడి చేయబడిన వ్యక్తికి మరియు బొమ్మకి ఒక బలమైన ఏర్పరుస్తాడు. అప్పుడు ఆ బొమ్మ రిమోట్ అయితే చేతబడి చేయబడ్డ వ్యక్తి రిసీవర్ లాగా మారుతాడు. అవగాహన చేసిన శక్తిని క్షుద్ర మంత్రాలతో శబ్ద తరంగాలు సృష్టించి దానిని ప్రతికూల శక్తిగా మార్చి ఆ వ్యక్తి మీదకు పంపిస్తాడు. ఎలా ప్రతికూలంగా మార్చాలో అధర్వణ వేదంలో విపులంగా చెప్పబడింది.
ఇంతకీ చేతబడి చేసి ఒక వ్యక్తిని చంపగలమా అంటే కచ్చితంగా కుదరదనే చెప్పాలి. మనిషికి కష్టనష్టాలు ఎదురైనప్పుడు మానసికంగా శారీరకంగా బలహీనంగా మారతాడు. ఇలా ఈ బాధల నుండి బయట పడాలా అని పదేపదే ఆలోచిస్తూ ఎవరు దేని గురించి చెప్పినా ఈజీగా నమ్మేస్తాడు. ఈ భయమే చేతబడి చేసే వారి ప్రధాన ఆయుధం. చేతబడి చేయించిన వారు ఆ వ్యక్తి ఇంట్లో నిమ్మకాయలు ఎముకలు వంటివి కనపడేలా చేసి మీకు ఏదో ప్రయోగం జరిగింది అని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. చేతబడి చేయడం వల్ల వచ్చిన ప్రతికూల శక్తి కంటే అతని భయమే అతని మానసికంగా శారీరకంగా బలహీనం చేసి చివరికి మరణించేలా చేస్తుంది. పాజిటివ్గా ఆలోచించే వారిపైన ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు…