
Talapatra : దెయ్యాలు ఆత్మలు నిజంగా ఉన్నాయా.. మనం మరణించిన వారితో మాట్లాడగలమా...!
Talapatra : దెయ్యాలు నిజంగా ఉన్నాయా.. మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఎక్కడికి వెళుతుంది. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య వల్ల మరణిస్తే ఆ ఆత్మ పైకి వెళ్ళకుండా దెయ్యంగా మారి ఇక్కడే తిరుగుతుందా.. చనిపోయిన వాళ్ళతో మనం మాట్లాడగలమా.. అసలు దయ్యాలు, భూతాలు నిజంగా ఉన్నాయా.. ఇలాంటివన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చిన్నప్పటినుండి ఆసక్తిగా ఎదురు చూస్తున్న సైన్స్ ఏమో దెయ్యాలు లేవంటే.. మంత్ర శాస్త్రం మాత్రం దుష్టశక్తులు కచ్చితంగా ఉన్నాయని చెప్తుంది. అసలు ఈ రెండిట్లో ఏది నమ్మాలి అనే సందిత్వం చాలా మందిలో ఉంటుంది. మరణం అనేది మన శరీరానికి మాత్రమే ఆత్మకు కాదని ఆత్మ నాశనం లేనిదని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా క్లియర్ గా చెప్పాడు. అలానే ఆయన ఈ సృష్టిలో ఎనర్జీ మరియు మాటలను ఎప్పుడు డిస్ట్రబ్ కావని ఒకదాని నుండి మరొక దానిలోకి ట్రాన్స్ఫర్ అవుతాయని వివరించారు. ఇక్కడ సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ రెండు థియరీస్ లో ఇద్దరు చెప్పింది. ఒక్కటే ఆత్మ అనేది ఒక ఎనర్జీ మిషన్ రన్ అవ్వడానికి కరెంటు ఎలా అవసరమో.. అలానే మన శరీరం పనిచేయడానికి లోపల ఉన్న ఆత్మ కూడా ఒక ఎనర్జీ సోర్స్ లాగా పని చేస్తూ మన శరీరాన్ని ముందుకు నడిపిస్తుంది. పురుషుని శుక్రకణం ద్వారా స్త్రీ అండల్లోకి ప్రవేశించిన ఆత్మ కట్టే కాలే వరకు అలానే అంటిపెట్టుకొని ఉంటుంది. అనారోగ్యం వలన లేదా ఏదైనా అనుకోని ప్రమాదం వలన అతడి చివరి క్షణాలు సమీపించినప్పుడు శరీరం ఆత్మను హోల్ చేసే కెపాసిటీని కోల్పోతుంది. ఆత్మ మూలాధార చక్రం ద్వారా సూక్ష్మ రూపంలో శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. దీనిని మనం పరిభాషలో మరణం సంభవించడం అంటాం. ఇక్కడ వరకు అందరికీ తెలిసింది. మరి అంగస్త పరిమాణంలో బయటకు వచ్చిన ఆత్మ ఏం చేస్తుంది? ఎక్కడకు వెళుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ప్రతి జీవి ఈ భూమి మీద పుట్టేటప్పుడు తనతో పాటుగా తాను గత జన్మలో చేసిన పాప పుణ్యాల ఆధారంగా వచ్చిన కర్మ ఫలాన్ని తీసుకొస్తారు. దీనిని ఈ జన్మలో అతడి ఆయుష్ ప్రమాణం పూర్తయ్య లోపల ఏదో ఒక రకంగా కచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. ఇదే కర్మ సిద్ధాంతం ఇప్పుడు శరీరం నుండి బయటకు వచ్చిన ఆత్మ ఏం చేస్తుంది? ఎక్కడకు వెళుతుందన్నది చూస్తే మరణంలో రెండు రకాలు ఉన్నాయి.
ఒకటి సకాలమరణం, రెండు అకాల మరణం.. సకాలం మరణం అంటే జీవికి భగవంతుడు కేటాయించిన ఆయుష్ ప్రమాణం పూర్తయ్యాక వృద్ధాప్యం వల్ల మరణించడం మరణించిన ఆత్మ ఈ భూమి మీద తన వారసులు పితృ కార్యాలు పూర్తి చేసే వరకు 13 రోజులపాటు ఆ పరిసరాలలో ఉండి సార్థకర్మలు పూర్తవ్వగానే తాను ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలకు తగిన శిక్షలు అనుభవించడానికి యమలోకానికి చేరి అక్కడ వాటిని అనుభవించి అవన్నీ క్లియర్ అయ్యాక పునర్జన్మ ద్వారా మరోదేహల్లోకి ప్రవేశిస్తుంది. ఇక రెండవది అకాల మరణం అంటే ఇంకా భూమి మీద ఆయిష్ తీరకుండానే యాక్సిడెంట్ వలన లేక సూసైడ్ వలన లేదా మరేదైనా ప్రమాదంలోనూ మరణించడం అన్న మాట. అంటే ఒక వ్యక్తి ఆయుష్ ప్రమాణం 60 సంవత్సరాలు అనుకుంటే సకాల మరణం వల్ల కాకుండా అకాల మరణం వల్ల 40 సంవత్సరాలకే చనిపోతే ఇంకా ఆ వ్యక్తి యొక్క ఈ భూమిపైన 20 సంవత్సరాలు బాలన్స్ ఉండిపోతుంది. తన ఆయుష్ ప్రమాణం పూర్తయ్యే వరకు సపరేట్ డైవర్షన్ లో ఉంటూ ఈ భూమి మీదే సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరిగే ఆత్మనే మనం పరిభాషలో దయ్యామని అంటాం. తమ పూర్తి ఆయిష్ తీరకుండా అర్ధాంతరంగా చనిపోయి బాధతో ఉండే ఈ ఆత్మలు సూక్ష్మ రూపంలో తిరుగుతూ తమ చావుకి కారణమైన వారి మీద ఏదో ఒకరకంగా పగులు తీర్చుకుంటూ ఉంటాయి. ఆత్మ సూక్ష్మలో శరీరం లేకుండా ఉంటుంది కాబట్టి దీనికి ఏదో ఒక శరీరం అవసరం అందుకే ఆత్మ తనకు నచ్చిన వారి శరీరంలోకి ఆవహించి తన పనులు చక్కబెట్టుకుంటూ మిగిలిన కోరికలు తీర్చుకుంటుంది. దీనినే మనం దెయ్యం పట్టడం అని పిలుస్తాము. ఆత్మ అనేది ఎవరి శరీరంలో పడితే వారి శరీరంలోకి ప్రవేశించలేదు. ఎవరైతే మానసికంగా ఈ శరీరం ద్వారా తీర్చుకుంటూ ఉంటుంది.
ఎప్పుడైతే ఈ భూమి మీద తన ఆయుష్ ప్రమాణం పూర్తయిందో.. సూక్ష్మ రూపంలో తిరిగే ఆత్మ సకాల మరణం లో ఎలా అయితే ఉర్దలోకానికి ప్రయాణం చేస్తుందో.. అదే మాదిరిగా పైకి వెళ్ళిపోతుంది. మరణించిన ఆత్మలతో మనం మాట్లాడగలమా.. అంటే కచ్చితంగా మాట్లాడొచ్చు.. అంటున్నారు పండితులు. ఆత్మలతో సంభాషించడానికి చాలా కఠోర సాధన అవసరం దీనికి సంబంధించిన విధి విధానాలు అధర్వణ వేదంలో విపులంగా వివరించబడ్డాయి. అలానే కేరళ అడవుల్లో కొన్ని రహస్య తాంత్రిక గ్రంథంలో కూడా ఆత్మలను ఎలా వసపరుచుకోవాలో వాటితో ఎలా సంభాషించాలనేవి చాలా స్పష్టంగా ఉన్నాయి. సూక్ష్మ రూపంలో ఉండే ఆత్మ మన కంటికి ఎలా అయితే కనిపించదు. దాని మాటలు కూడా మామూలు మనిషికి వినబడవు. సెల్ఫోన్ సిగ్నల్స్ మన కంటికి కనపడకుండా ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయో.. ఆత్మల నుండి వచ్చే సందేశాలు వాటి మాటలు కూడా అలానే ఉంటాయి. ఎవరైతే సాధన చేసి నిచ్చల చిత్తంతో ధ్యానంలో కూర్చుంటారు. వారికి మాత్రమే వాటి మాటలు అర్థం అవుతాయి. కొంతమంది తాము జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఎవరికీ తెలియకుండా ఎక్కడో దాచి చివర్లో తమ వారికి ఇద్దాం అనుకుంటారు. అలాంటివారు అర్ధాంతరంగా చనిపోయినప్పుడు చాలా మధనపడుతూ అటూ ఇటూ తిరుగుతూ తమవారికి ఏదోలా ఈ విషయం చెప్పాలని తాపత్రయపడుతూ ఉంటారట. అలాంటి ఆత్మలతో ఈజీగా సంభాషించవచ్చట. ఆత్మ అనే పేరు వినగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే ఆత్మలు ఎలాంటి హాని చేయవు. కానీ కోరికలు తీరకుండా చనిపోయిన ఆత్మ ప్రయత్నాత్మక మారినప్పుడు మాత్రం అది తన కోరికలు తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తుందట..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.