
Rashmi Gautam : మామూలోడు కాదు రష్మీతో పులిహోర కలుపుతున్న శేఖర్ మాస్టర్.. ఆయన టాలెంట్ ని బయటపెట్టిన ఇంద్రజ ..!
Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దశాబ్దానికి పైగా ఆమె బుల్లితెరపై సందడి చేస్తూ వస్తున్నారు. ఆ క్రేజ్ కి కారణం ఆమె అందంతో పాటు అభినయం కూడా అని చెప్పవచ్చు. జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్ , రష్మీ మధ్య చాలా మంచి బాండింగ్ ఏర్పడింది. లవర్స్ గా చలామణి అయ్యారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. అది జబర్దస్త్ షో కి టీఆర్పి రేటింగ్ తేవడంలో సక్సెస్ అయింది. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దాదాపుగా ఏడాదిన్న వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. సుధీర్ జబర్దస్త్ మానేసి సినిమాలలో బిజీగా ఉన్నారు. హీరోగా పలు సినిమాలు చేస్తున్నారు. ఇక రష్మీ బుల్లితెరపై రచ్చ చేస్తూనే ఉన్నారు. అవకాశాలు వస్తే వెండితెరపై కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే సుధీర్, రష్మీ చాలా కాలంగా కలిసి లేకపోవడంతో ఇద్దరి అభిమానులు ఫీల్ అవుతున్నారు.సుధీర్ రష్మీ మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో టీవీ షో లోను వెలితి కనిపిస్తుందని తరచుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కానీ ఒంటరిగానే రష్మి జబర్దస్త్ చేస్తుంది.
తనవంతుగా అలరించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పుడు రష్మి తో శేఖర్ మాస్టర్ పులిహోర కలపడం ఆశ్చర్యంగా మారింది. రష్మీ ఎలాగు సింగిల్ గానే ఉంది. ఇది అడ్వాంటేజ్ గా తీసుకున్న శేఖర్ మాస్టర్ రష్మితో పులిహోర కలుపుతూ దొరికిపోయాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో రష్మితో శేఖర్ మాస్టర్ పులిహోర కలుపుతూ దొరికిపోయాడు. అంతేకాదు అటు ఇంద్రజ ఇటు రాంప్రసాద్ సైతం దానిని కనిపెట్టి వెంటనే సెటైర్లతో విరుచుకుపడ్డారు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. మొదటిసారి శేఖర్ మాస్టర్ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాడు. రావడం రావడంతో పులిహోర మొదలుపెట్టాడు. కానీ రష్మీ రోజురోజుకి అందం పెరుగుతుంది. మాకు అర్థం కావడం లేదు అంటూ రష్మీ పై చేయి వేశాడు. దీంతో రష్మీ సిగ్గు పడిపోతుంది. ఏకంగా డాన్సులు కూడా వేసింది. శేఖర్ మాస్టర్ పొగడ్తలకు రష్మీ ఊగిపోయింది. దీంతో మధ్యలో కల్పించుకొని సార్ మీరు చేయి వదిలేయండి ఫస్ట్ అంటూ రాంప్రసాద్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే రష్మీ చేయి వదిలేశాడు. దీనిపై ఇంద్రజ స్పందించింది. డాన్సర్ భూమికను పట్టుకొని భూమిక ఏంటమ్మా ఈ టాలెంట్ మాస్టర్ కే తెలియాలి అని పంచులు వేసింది.దీంతో శేఖర్ మాస్టర్ కి ఫ్యూజులు అవుట్ అయ్యాయి. నవ్వులతో కవర్ చేసుకున్నారు.
కానీ ఏంటి మేడం టాలెంట్ అంటున్నారు అని అడగ్గా నేను అన్నది భూమికా డాన్స్ టాలెంట్ గురించి మీరు అంటున్న టాలెంట్ ఏంటో నాకు తెలియదు అంటూ మరోసారి ఇంద్రజ పంచ్ విసిరింది. దీంతో మరోసారి రచ్చలేచిపోయింది. దీనికి రియాక్ట్ అవుతూ డాన్స్ గురించి అయితే అందరికీ తెలుసు. భూమిక బాగా చేస్తుందని అన్నాడు. దీనికి రష్మీ చెబుతూ నేను అదే చెబుతున్న మాస్టర్ అంటూ రియాక్ట్ అయింది. మరి వాళ్లంతా ఎందుకు అరుస్తున్నారని శేఖర్ మాస్టర్ అడగ టాలెంట్ గురించి అని రష్మీ చెప్పడంతో షో మొత్తం హోరెత్తిపోయింది. కామెడీగా చేసిన ఈ సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. ఈ ప్రోమో యూట్యూబ్లో రచ్చ చేస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ఈటీవీలో ప్రసారం కానుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.