Swapna Shasthram : చెడు జరిగే ముందు నిద్రలో వచ్చే కలలు ఇవే… ఇలాంటి కలలు వస్తే ఏమవుతుందో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Swapna Shasthram : చెడు జరిగే ముందు నిద్రలో వచ్చే కలలు ఇవే… ఇలాంటి కలలు వస్తే ఏమవుతుందో తెలుసా..?

 Authored By aruna | The Telugu News | Updated on :1 March 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Swapna Shasthram : చెడు జరిగే ముందు నిద్రలో వచ్చే కలలు ఇవే... ఇలాంటి కలలు వస్తే ఏమవుతుందో తెలుసా..?

Swapna Shasthram  : చాలామందికి నిద్రలో పీడకల రాగానే ఉలిక్కిపడి లేచి అది నిజమవుతుందేమో అని చాలా గాబరా పడుతుంటాం. అది తెల్లవారుజామున వస్తే ఇంకా కంగారు పడటం.. మరి నిజంగా పీడకలలో నిజమవుతాయా.. అసలు ఏది పీడకలో.. ఏది మంచికలో ఎలా తెలుస్తుంది. పీడకలను రాకుండా ఉండాలంటే ఏ మంత్రం చదువుకోవాలి. తదితర ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి యొక్క ఆలోచనలను వారి స్వభావం చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా కలలు అనేవి వస్తూ ఉంటాయి.మనిషి నిద్రపోయినా లోపల ఉన్న మనసు మాత్రం నిద్రపోకుండా మనోవేగంతో సంచరిస్తూ గత స్మృతుల్ని వెలికితీస్తూ భవిష్యత్తులోకి తొంగి చూస్తూ కలను కంటూ ఉంటుంది. అవి మంచి కలలు కావచ్చు.. చెడు కలలు కావచ్చు.. ముఖ్యంగా తెల్లవారుజామున అంటే మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మన మనసుకు భవిష్యత్తును దర్శించే శక్తి మరింత ఎక్కువగా ఉంటుందట.

అందుకే మన పెద్దలు తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని చెప్తారు. అంటే మన మనసు టైం ట్రావెల్స్ చేసి భవిష్యత్తులో మనకు ఎదురు కాబోయే మంచి చెడుల గురించి స్వప్నం ద్వారా మనల్ని అలెర్ట్ చేస్తుందన్నమాట. ఇంతవరకు బానే ఉంది. మరి వచ్చిన కళల్లో అవి మంచి వాటి ఫలితం ఎలాంటిదో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా..? ఇప్పుడు అక్కడికే వద్దాం.. పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు, దైవ దర్శనం, నల్లటి మేఘాలు, పడగవిప్పిన సర్పం ఇవి కలలోకి వస్తే త్వరలో మీకు మంచి జరగబోతుందని అర్థమట. ఇక చెడుకలను విషయానికి వస్తే స్వప్నంలో పంది కనిపిస్తే రోడ్డు ప్రమాదానికి సంకేతమట. అలానే కలలో చిల్లర డబ్బులు కనిపిస్తే త్వరలో మరణం లేదా మరణ వార్త వింటారని అర్థమట. ఎవరు మనల్ని దక్షిణ దిక్కుకు లాక్కునిపోతున్నట్లు కల వస్తే త్వరలో దీర్ఘవ్యాధి కలుగుతుందట. దున్నపోతు, పులి, సింహం, పాము, కుక్క, పంది, కోతి వెనక నుండి తరుముతున్నట్లు కల వస్తే రాజ భయం అంటే మీ కంటే ఎగువ స్థాయిలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయబోతున్నారని అర్థం.

అలానే పండ్లు దొంగిలించినట్లు, గడ్డి కోస్తున్నట్లు, కట్టెలు ఎదురు వచ్చినట్లు ,ఎన్నటి వస్త్రాలు, ఎర్రటి పువ్వులు ధరించినట్లు ఒంటె మీద ఎక్కినట్లు, నల్లని తాడును చేత పట్టుకున్నట్లు కలలో కనిపిస్తే కీడుకి సంకేతమట. మనకు కావలసినవారు చనిపోయినట్లు కల వస్తే వారికి పెద్ద గండం గట్టెక్కి పూర్ణాష్కలయ్యారని అర్థమట. ఫీడ కల రాగానే మెలకువ వస్తే కాస్త స్థిమిత పడిన తర్వాత కాళ్లు చేతులు కడుక్కొని ఇష్టదైవాన్ని ప్రార్థించి తదుపరి నిద్రపోవాలట. అలా నిద్రించినప్పుడు మంచి స్వప్నము వస్తే ముందు వచ్చిన పిడ కలయొక్క దోషం పోతుందని పండితులు చెప్తున్నారు. ఇక అసలు పీడకలను రాకూడదని అనుకుంటే పడుకునే ముందు కళ్ళు మూసుకుని రామ స్కంధం.. హనుమంతం వైనతేయం; రుణోదయం సైనే మరే నిత్యం దుస్పనం తస్య నక్షతి :అనే శ్లోకాన్ని పఠించి నిద్రపోతే అసలు చెడు కలలనేవే రావని పండితులు చెబుతున్నారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది