Sleep | రాత్రి పూట హాయిగా నిద్ర పోవాలి అంటే ఇవి తింటే చాలు..
Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిద్ర మాత్రలకు మారుగా సహజమైన మార్గాలను అనుసరించడం ఉత్తమం.నిద్ర అనేది శరీరం, మెదడుకు విశ్రాంతినిచ్చే ఒక సహజమైన స్థితి. నిద్ర లేకపోవడం గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మతిమరుపు, కుంగుబాటు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

#image_title
మంచి నిద్ర కోసం..
అందులో ముఖ్యమైనదే మెగ్నీషియం. కండరాల సడలింపుకు, మెదడులో సరోటొనిన్ (serotonin) మరియు మెలటోనిన్ (melatonin) ఉత్పత్తికి కీలకంగా పనిచేస్తుంది. ఈ హార్మోన్లు నిద్ర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. బీన్స్‌లో మెగ్నీషియంతో పాటు ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చడం వల్ల శరీరం సరిగా విశ్రాంతి పొందుతూ నిద్రనుబాగా పొందగలుగుతుంది.
పాలకూరలో ఉండే మెగ్నీషియం, ఐరన్, ఇతర మినరల్స్ శరీరాన్ని రిలాక్స్ చేయడంలో సహాయపడతాయి. దీన్ని సూప్, కర్రీల రూపంలో తీసుకోవచ్చు.రోజూ కొద్దిగా బాదం తినడం మనసుకు ప్రశాంతతను తీసుకువస్తుంది. బాదాల్లో మెగ్నీషియంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. అరటిపండులో ఉండే ఆరోగ్యకరమైన స్నాక్ కండరాల నొప్పులు తగ్గించి, మెదడును ప్రశాంతపరుస్తాయి. రాత్రి పడుకునే ముందు తింటే మంచి నిద్ర వస్తుంది. గుమ్మడికాయ గింజలు, డార్క్ చాక్లెట్ కూడా నిద్రకి ముందు తీసుకోవడం ఉత్తమం.