Solar Eclipse : సూర్య గ్రహణం తర్వాత ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…!
Solar Eclipse : సృష్టిలో జరిగే అద్భుతమైన సంఘటన సూర్యగ్రహణం. అక్టోబర్ 25న సూర్యగ్రహణం అయిపోయింది. ఈ సంవత్సరంలో ఇది రెండో సూర్యగ్రహణం కావడమే కాకుండా ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం కూడా. అయితే ఈ సూర్యగ్రహణం భారత్ లో సహా ఐరోపా, ఈశాన్య, ఆఫ్రికా దేశాలలో సంభవించింది. ఇండియాలో మాత్రం కొన్నిచోట్ల మాత్రమే కనిపించింది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం వలన కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి, మరి కొందరికి మాత్రం మధ్యస్థ ఫలితాలు, ఇంకొందరికి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని తులా రాశి వారు చూడకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఇది స్వాతి నక్షత్రంలో సంభవించింది కనుక.
ఈ పాక్షిక సూర్యగ్రహణం వలన సింహరాశి, వృషభం, మకరం, ధనుస్సు రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. అలాగే కన్యా రాశి, కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు అలాగే కర్కాటకం తుల మీనం, వృశ్చిక రాశి వారికి ఆశుభాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. మేషరాశి వారికి ధనం పార్ట్నర్స్ విషయాలలో చక్కగా ఉండనుంది. వృషభ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్ విషయంలో అనుకూలంగా ఉంటుంది. స్ర్తీలతోత గొడవ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ వలన ఆరోగ్య విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారికి బిజినెస్ లాభాలు ఉన్నాయి. సంతానం, ఇన్వెస్ట్మెంట్ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ రాశి వారు ఆస్తి, వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి వారు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరికి చదువు విషయంలో మంచిగా ఉంది. తండ్రి లేదా గురువు నుంచి సహకారం లభిస్తుంది. ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్య రాశి వారు ధన సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్సూరెన్స్ మూలంగా మంచి జరిగే అవకాశం ఉంది. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ ఆరు రాశుల వారు సూర్యుడిని ఆరాధించాలి. మేష రాశి వారు గణపతిని ఆరాధించాలి. వృషభం వారు విష్ణు సహస్రనామాలను పఠించాలి. మిధునం వారు సూర్యుడు, గణపతి, అమ్మవారి పూజించాలి. కర్కాటక వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించాలి. సింహం వారు దత్తాత్రేయుడిని కన్య వారి వెంకటేశ్వర స్వామి ఆరాధించాలి. ఇలా చేస్తే అన్ని విషయాలలో చక్కగా ఉంటుంది.