Ramzan : రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్నారా.. అయితే తినే ముందు ఇలా చేయండి..
Ramzan : రంజాన్ మాసాన్ని ముస్లింలు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కరోజైనా సరే ఉపవాసం చేస్తుంటారు. పేద, ధనిక అనే బేధం లేకుండా తమకు ఉన్నంతలో ఉపవాస ప్రక్రియను పూర్తి చేస్తారు. రంజాన్ ఉపవాసం ఘోరమైన, కఠిన నిష్టలు, నియమాలతో కూడి ఉంటుంది. ఎంత కష్టమైనా సరే ముస్లింలు ఈ ఉపవాసం చేసేందుకే మొగ్గు చూపిస్తారు. ఈ ఉపవాస సమయంలో ఉపవాసం ఉన్న వారు తినేందుకు ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. ఉపవాసం చేసిన వారు కేవలం ఆ సమయంలో మాత్రమే నీటిని తాగాలి మరియు ఆహారం తీసుకోవాలి.
చాలా మంది పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి, ఉండీ డైరెక్టుగా టైం కాగానే ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. కానీ అది అంత మంచి పద్ధతి కాదని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.రంజాన్ ఉపవాస సమయంలో ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ డీ హైడ్రేట్ కు గురవుతారు. కావున ఉపవాస సమయం పూర్తికాగానే మొదటగా మంచి నీళ్లు తాగడం చాలా అవసరం. అలా కాకుండా డైరెక్టుగా ఆహార పదార్థాలు తింటే గ్యాస్ సమస్య వేధించే ప్రమాదం ఉంది.
కనీసం లీటర్ లేదా లీటర్ నర నీటిని తీసుకోవడం చాలా అవసరం. ఒకేసారి నీరు తాగడం ఇబ్బందిగా ఉంటే ఓ పది నిమిషాల సమయం తీసుకొనైనా నీటిని తాగడం చాలా అవసరం. ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి తినే ఆహారంలో ఎక్కువగా కారం లేని ఆహారం తీసుకోవాలి. రెండు పుల్కాలు, రెండు రకాల కూరలు ప్రిఫర్ చేయాలి. నెల రోజుల పాటు ఇలా పాటించడం వలన శరీరంలో ఉండే కొవ్వు మొత్తం తగ్గుతుంది. డీటాక్సిఫికేషన్ అవుతుంది. రక్త శుద్ధి జరుగుతుంది. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఏవైనా ఉంటే కంట్రోల్ అవుతాయి.